1
సామెత 19:21
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
మనిషి హృదయంలో ఆలోచనలు అనేకం. అయితే యెహోవా ఉద్దేశాలే నిలబడతాయి.
సరిపోల్చండి
Explore సామెత 19:21
2
సామెత 19:17
పేదలను ఆదుకోవడం అంటే యెహోవాకు అప్పివ్వడమే. ఆయన తప్పకుండా ఆ రుణం తీరుస్తాడు.
Explore సామెత 19:17
3
సామెత 19:11
విచక్షణ ఒక మనిషికి సహనం ఇస్తుంది. తప్పులు చూసీ చూడనట్టు పోవడం అతనికి ఘనత.
Explore సామెత 19:11
4
సామెత 19:20
సలహా వినిపించుకో, సూచనలను అంగీకరించు. అలా చేశావంటే పెద్దవాడయ్యే నాటికి జ్ఞానివి అవుతావు.
Explore సామెత 19:20
5
సామెత 19:23
యెహోవాకు చెందవలసిన భయభక్తులు ఆయనకి చెల్లించాలి. అది జీవ సాధనం. అది ఉన్న వాడు తృప్తిగా బ్రతుకుతాడు.
Explore సామెత 19:23
6
సామెత 19:8
బుద్ధి సంపాదించుకొనేవాడు తనకు తాను మేలు చేసుకుంటాడు. అవగాహన కలిగిన వాడు మేలైనదాన్ని కనుగొంటాడు.
Explore సామెత 19:8
7
సామెత 19:18
అనువైన కాలంలోనే నీ కుమారుణ్ణి శిక్షించు. అయితే వాణ్ణి చంపాలని చూడొద్దు.
Explore సామెత 19:18
8
సామెత 19:9
అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు నాశనమౌతాడు.
Explore సామెత 19:9
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు