“సౌలు వేల కొలదిగాను హతము చేసెననియు
దావీదు పదివేల కొలదిగా హతము చేసెననియు”
స్త్రీలంతా జయగీతిక పాడారు.
స్త్రీల పాట సౌలును కలవర పెట్టింది. అతనికి చాలా కోపం వచ్చింది. “తాను వేలమందిని మాత్రమే చంపానని దావీదు పదివేల మందిని చంపాడని స్త్రీలు చెబుతున్నారే” అని సౌలు పరి పరి విధాల ఆలోచనచేశాడు.