యెహోవా, నీవే నాకు బలం; నీవే నాకు రక్షణ.
ఆపదలో తలదాచుకోటానికి నీవే సురక్షితమైన చోటు.
ప్రపంచ దేశాలన్నీ నీ శరణు వేడి వస్తాయి.
ఆ దేశాల వారంతా ఇలా అంటారు: “మా పితరులు చాలామంది బూటకపు దేవుళ్లను నమ్మారు.
వారా పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.
కాని ఆ విగ్రహాలు వారికి ఏ రకంగానూ సహాయపడలేవు.