1
1 యోహాను పత్రిక 2:15-16
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ఈ లోకాన్ని లోకంలో ఉన్న దేన్ని ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి పట్ల ప్రేమ వారిలో ఉండదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు గర్వం. ఇవి తండ్రి నుండి రాలేదు, ఇవన్నీ లోకం నుండే వచ్చాయి.
సరిపోల్చండి
Explore 1 యోహాను పత్రిక 2:15-16
2
1 యోహాను పత్రిక 2:17
ఈ లోకం దాని ఆశలు గతించిపోతాయి కాని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు శాశ్వతంగా జీవిస్తారు.
Explore 1 యోహాను పత్రిక 2:17
3
1 యోహాను పత్రిక 2:6
ఆయనలో జీవిస్తున్నామని చెప్పేవారు యేసు క్రీస్తులా జీవించాలి.
Explore 1 యోహాను పత్రిక 2:6
4
1 యోహాను పత్రిక 2:1
నా ప్రియ పిల్లలారా, మీరు పాపం చేయకూడదని మీకు ఇలా వ్రాస్తున్నాను. కాని ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర న్యాయవాదిగా నీతిమంతుడైన యేసు క్రీస్తు మనకు ఉన్నారు.
Explore 1 యోహాను పత్రిక 2:1
5
1 యోహాను పత్రిక 2:4
కాని ఎవరైనా, “నేను ఆయనను తెలుసుకున్నాను” అని చెప్తూ, ఆయన ఆజ్ఞాపించింది చేయనివారు అబద్ధికులు, వారిలో సత్యం ఉండదు.
Explore 1 యోహాను పత్రిక 2:4
6
1 యోహాను పత్రిక 2:3
మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం ఆయనను తెలుసుకున్నామని మనకు తెలుస్తుంది.
Explore 1 యోహాను పత్రిక 2:3
7
1 యోహాను పత్రిక 2:9
తాను వెలుగులో ఉన్నానని చెప్తూ తన సహోదరున్ని సహోదరిని ద్వేషించేవారు ఇంకా చీకటిలోనే ఉన్నారు.
Explore 1 యోహాను పత్రిక 2:9
8
1 యోహాను పత్రిక 2:22
అయితే అబద్ధికులు ఎవరు? ఎవరైతే యేసును క్రీస్తు కాదంటారో వారే. తండ్రిని కుమారుని తిరస్కరించేవాడే క్రీస్తు విరోధి.
Explore 1 యోహాను పత్రిక 2:22
9
1 యోహాను పత్రిక 2:23
ఎందుకంటే, కుమారుని తిరస్కరించిన వారికి తండ్రి లేడు; కుమారుని అంగీకరించినవారికి తండ్రి ఉన్నాడు.
Explore 1 యోహాను పత్రిక 2:23
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు