అక్కడ హోరేబులో బండ దగ్గర నేను నీకు ఎదురుగా నిలబడి ఉంటాను. నీవు ఆ బండను కొట్టు, ప్రజలు త్రాగడానికి ఆ బండ నుండి నీళ్లు వస్తాయి” అని చెప్పారు. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలు చూస్తుండగా యెహోవా చెప్పినట్టు చేశాడు. ఇశ్రాయేలీయులు, “యెహోవా మన మధ్య ఉన్నాడా లేడా?” అని అంటూ మోషేతో జగడమాడి, యెహోవాను పరీక్షించారు కాబట్టి మోషే ఆ చోటికి మస్సా అని మెరీబా అని పేరు పెట్టాడు.