‘అయ్యో నాకు శ్రమ! యెహోవా నా బాధకు దుఃఖాన్ని జోడించారు; నేను మూలుగులతో సొమ్మసిల్లిపోయాను, నాకు నెమ్మది లేదు’ అని నీవు అనుకుంటున్నావు. అయితే యెహోవా నీతో, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: నేను కట్టిన దాన్ని నేనే కూలదోస్తాను, నేను నాటిన వాటిని నేనే పెరికివేస్తాను; ఇది భూమి అంతటా జరుగుతుంది’ అని చెప్పమని నాకు చెప్పారు.