ప్రవక్తయైన యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లుగా:
“ ‘ప్రభువు కొరకు మార్గాన్ని సిద్ధపరచండి,
ఆయన కొరకు త్రోవలను సరిచేయండి.
ప్రతి లోయ పూడ్చబడుతుంది,
ప్రతి పర్వతం, కొండ పల్లంగా చేయబడుతుంది.
వంకర త్రోవలు తిన్ననివవుతాయి,
గరుకు మార్గాలు నునుపు అవుతాయి.
అందరు దేవుని రక్షణను చూస్తారు,’
అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్తున్న ఒకరి స్వరం.”