1
రోమా పత్రిక 14:17-18
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
దేవుని రాజ్యం తినడం త్రాగడం కాదు. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం. ఎందుకంటే క్రీస్తుకు సేవ చేసేవారు దేవునికి ఇష్టులును మానవుల దృష్టికి యోగ్యులుగా ఉన్నారు.
సరిపోల్చండి
Explore రోమా పత్రిక 14:17-18
2
రోమా పత్రిక 14:8
మనం జీవించినా ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే, కాబట్టి మనం జీవించినా మరణించినా ప్రభువుకు చెందినవారమే.
Explore రోమా పత్రిక 14:8
3
రోమా పత్రిక 14:19
కాబట్టి మనకు సమాధానాన్ని, పరస్పర వృద్ధిని కలిగించే దానినే మనం చేద్దాం.
Explore రోమా పత్రిక 14:19
4
రోమా పత్రిక 14:13
కాబట్టి ఒకరిపై ఒకరు తీర్పు తీర్చడం మాని సహోదరి లేదా సహోదరుని మార్గానికి ఆటంకం కలిగించము అని తీర్మానం చేసుకుందాం.
Explore రోమా పత్రిక 14:13
5
రోమా పత్రిక 14:11-12
దీని కోసం లేఖనంలో, “ప్రభువు ఇలా చెప్తున్నారు, ‘నా జీవం తోడని ప్రమాణం చేస్తున్నాను, ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది, ప్రతి నాలుక దేవుని స్తుతిస్తుంది’” అని వ్రాయబడి ఉంది. కాబట్టి, మనలో ప్రతి ఒక్కరు మన గురించి మనం దేవునికి లెక్క అప్పగించాలి.
Explore రోమా పత్రిక 14:11-12
6
రోమా పత్రిక 14:1
వివాదాస్పదమైన అంశాలపై వాదన పెట్టుకోక విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారిని చేర్చుకోండి.
Explore రోమా పత్రిక 14:1
7
రోమా పత్రిక 14:4
వేరేవాళ్ళ సేవకునికి తీర్పు తీర్చడానికి నీవెవరవు? అతడు నిలబడినా పడిపోయినా అది అతని యజమాని చూసుకుంటాడు. ప్రభువు వారిని నిలబెట్టడానికి శక్తిగలవాడు కాబట్టి వారు నిలబడతారు.
Explore రోమా పత్రిక 14:4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు