దావీదు ఈ మాటలు గుర్తుపెట్టుకుని గాతు రాజైన ఆకీషుకు చాలా భయపడ్డాడు. కాబట్టి దావీదు వారి ఎదుట తన ప్రవర్తన మార్చుకొని పిచ్చివానిలా నటిస్తూ గుమ్మాల తలుపుల మీద గీతలు గీస్తూ, ఉమ్మి తన గడ్డం మీదికి కారనిస్తుండేవాడు. వారు అతన్ని పట్టుకున్నప్పుడు అతడు పిచ్చి చేష్టలు చేస్తుండేవాడు.