1
ఎఫెసీ పత్రిక 6:12
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
ఎందుకంటే, మనం పోరాడేది శరీరులతో కాదు, కాని పాలకులతో, అధికారులతో, ఈ చీకటి లోకపు శక్తులతో ఆకాశమండలంలో ఉన్న దురాత్మల బలగాలతో వ్యతిరేకంగా పోరాడుతున్నాము.
సరిపోల్చండి
Explore ఎఫెసీ పత్రిక 6:12
2
ఎఫెసీ పత్రిక 6:18
ఆత్మలో అన్ని సందర్భాలలో అన్ని రకాల ప్రార్థనలతో విన్నపాలతో ప్రార్థించండి. దీన్ని మనస్సులో ఉంచుకొని, మెలకువగా ఉండి పరిశుద్ధులందరి కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉండండి.
Explore ఎఫెసీ పత్రిక 6:18
3
ఎఫెసీ పత్రిక 6:11
మీరు అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులు కావడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
Explore ఎఫెసీ పత్రిక 6:11
4
ఎఫెసీ పత్రిక 6:13
అందుకే ఆపద రోజున మీరు వారిని ఎదిరించడానికి, శక్తిమంతులుగా నిలబడడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
Explore ఎఫెసీ పత్రిక 6:13
5
ఎఫెసీ పత్రిక 6:16-17
వీటితో పాటు, విశ్వాసమనే డాలు పట్టుకోండి. దీనితో మీరు దుష్టుని అగ్నిబాణాలన్నిటిని ఆర్పడానికి శక్తిమంతులు అవుతారు. రక్షణ అనే శిరస్త్రాణాన్ని, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి.
Explore ఎఫెసీ పత్రిక 6:16-17
6
ఎఫెసీ పత్రిక 6:14-15
స్థిరంగా నిలబడి, మీ నడుములకు సత్యమనే నడికట్టు కట్టుకుని, నీతి అనే కవచాన్ని ధరించుకొని, పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనస్సు అనే చెప్పులు వేసుకుని నిలబడండి.
Explore ఎఫెసీ పత్రిక 6:14-15
7
ఎఫెసీ పత్రిక 6:10
చివరిగా, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి.
Explore ఎఫెసీ పత్రిక 6:10
8
ఎఫెసీ పత్రిక 6:2-3
“మీ తండ్రిని తల్లిని గౌరవించాలి, ఇది వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ. దాని వలన మీకు మేలు కలుగుతుంది, మీరు సంతోషంగా భూమి మీద దీర్ఘాయువు కలిగి జీవిస్తారు.”
Explore ఎఫెసీ పత్రిక 6:2-3
9
ఎఫెసీ పత్రిక 6:1
పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, అది సరియైనది.
Explore ఎఫెసీ పత్రిక 6:1
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు