వారు యెరూషలేములో యెహోవా ఆలయానికి చేరుకున్నప్పుడు, కుటుంబ పెద్దలలో కొందరు ఆ స్థలంలో దేవుని మందిరాన్ని పునర్నిర్మించడానికి స్వేచ్ఛార్పణలు ఇచ్చారు. వారు ఈ పని కోసం తమ శక్తి కొద్ది 61,000 డారిక్కుల బంగారం, 5,000 మీనాల వెండిని, యాజకులకు 100 వస్త్రాలను ఇచ్చారు.