మేము రాజుతో, “మా దేవున్ని వెదికే ప్రతి ఒక్కరిపై ఆయన కరుణాహస్తం ఉంటుంది. ఆయనను విడిచిపెట్టినవారి మీద ఆయన తీవ్రమైన కోపం కుమ్మరించబడుతుంది” అని చెప్పాము కాబట్టి, దారిలో ఎదురయ్యే శత్రువులు నుండి కాపాడడానికి సైనికులు, గుర్రపురౌతులను మాకు సహాయంగా పంపమని రాజును అడగడానికి నేను సిగ్గుపడ్డాను. కాబట్టి మేము ఉపవాసముండి, దీని గురించి మా దేవునికి మొరపెట్టగా, ఆయన మా ప్రార్థనకు జవాబిచ్చారు.