1
యెషయా 60:1
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
“లేచి ప్రకాశించు, నీ వెలుగు వచ్చింది, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది.
సరిపోల్చండి
Explore యెషయా 60:1
2
యెషయా 60:3
దేశాలు నీ వెలుగు దగ్గరకు వస్తాయి, రాజులు నీ ఉదయకాంతి దగ్గరకు వస్తారు.
Explore యెషయా 60:3
3
యెషయా 60:2
చూడు, భూమిని చీకటి కమ్ముతుంది కటిక చీకటి జనాంగాలను కమ్ముకుంటుంది. కాని యెహోవా నీ మీద ఉదయిస్తున్నారు. ఆయన మహిమ నీ మీద కనబడుతుంది.
Explore యెషయా 60:2
4
యెషయా 60:22
నీలో చిన్నవాడు వేయిమంది అవుతాడు, కొద్దిగా ఉన్నది బలమైన దేశమవుతుంది. నేను యెహోవాను; సరియైన సమయంలో ఈ పనిని త్వరగా చేస్తాను.”
Explore యెషయా 60:22
5
యెషయా 60:19
ఇకమీదట పగలు సూర్యుని వెలుగు నీకు ఉండదు, చంద్రుని వెన్నెల నీపై ప్రకాశించదు, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు. నీ దేవుడు నీకు మహిమగా ఉంటారు.
Explore యెషయా 60:19
6
యెషయా 60:20
నీ సూర్యుడికపై అస్తమించడు. నీ చంద్రుడు క్షీణించడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు, నీ దుఃఖ దినాలు అంతమవుతాయి.
Explore యెషయా 60:20
7
యెషయా 60:5
అప్పుడు నీవు చూసి ప్రకాశిస్తావు. నీ గుండె కొట్టుకొంటూ ఆనందంతో పొంగుతుంది; సముద్ర సంపద నీ దగ్గరకు త్రిప్పబడుతుంది, దేశాల సంపద నీ దగ్గరకు వస్తుంది.
Explore యెషయా 60:5
8
యెషయా 60:4
“నీ కళ్లు పైకెత్తి చూడు: అందరు కలిసి నీ దగ్గరకు వస్తున్నారు; నీ కుమారులు దూరం నుండి వస్తున్నారు, నీ కుమార్తెలు చంకనెక్కి వస్తున్నారు.
Explore యెషయా 60:4
9
యెషయా 60:21
అప్పుడు నీ ప్రజలందరు నీతిమంతులుగా ఉంటారు; వారు దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. నా వైభవం కనుపరచడానికి వారు నేను నాటిన కొమ్మగా నా చేతుల పనిగా ఉంటారు.
Explore యెషయా 60:21
10
యెషయా 60:18
ఇకపై నీ దేశంలో హింస అనేది వినబడదు, నీ సరిహద్దులలో నాశనం గాని విధ్వంసం గాని వినపడదు. అయితే నీవు నీ గోడలను రక్షణ అని నీ గుమ్మాలను స్తుతి అని పిలుస్తావు.
Explore యెషయా 60:18
11
యెషయా 60:11
నీ దగ్గరకు దేశాల సంపద తీసుకురావడానికి, జయోత్సవంతో వారి రాజులను నడిపించడానికి, నీ ద్వారాలు రాత్రింబగళ్ళు మూసివేయకుండా నిత్యం తెరిచే ఉంటాయి.
Explore యెషయా 60:11
12
యెషయా 60:6
ఒంటెల మందలు, మిద్యాను ఏఫాల ఒంటె పిల్లలతో నీ దేశం నిండిపోతుంది. వారందరు షేబ నుండి వస్తారు, బంగారం ధూపద్రవ్యాలను తీసుకువస్తారు, యెహోవా స్తుతిని ప్రకటిస్తారు.
Explore యెషయా 60:6
13
యెషయా 60:10
“విదేశీయులు నీ గోడల్ని మరల కడతారు, వారి రాజులు నీకు సేవ చేస్తారు. నేను కోపంలో నిన్ను కొట్టాను కాని, నేను కరుణించి నీ మీద దయ చూపిస్తాను.
Explore యెషయా 60:10
14
యెషయా 60:15
“నీవు విడిచిపెట్టబడి, ద్వేషించబడి నీ మార్గంలో ఎవరూ ప్రయాణించకపోయినా, నేను నిన్ను శాశ్వత ఘనతగా అన్ని తరాలకు ఆనందంగా చేస్తాను.
Explore యెషయా 60:15
15
యెషయా 60:16
నీవు దేశాల పాలు త్రాగుతావు రాజుల చనుపాలు త్రాగుతావు. అప్పుడు నీవు యెహోవానైన నేనే నీ రక్షకుడనని యాకోబు యొక్క బలవంతుడైన నీ విమోచకుడని తెలుసుకుంటావు.
Explore యెషయా 60:16
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు