యెహోవా ఇలా అంటున్నారు:
“మనుష్యుల మీద నమ్మకం పెట్టుకునేవారు,
కేవలం శరీర బలం మీద ఆధారపడేవారు,
యెహోవా నుండి తమ హృదయాన్ని త్రిప్పివేసుకునేవారు శాపగ్రస్తులు.
వారు బంజరు భూములలో పొదలా ఉంటారు;
వృద్ధి కలిగినప్పుడు వారు దానిని చూడరు.
వారు ఎడారిలోని ఎండిన ప్రదేశాల్లో,
ఎవరూ నివసించని ఉప్పు భూమిలో నివసిస్తారు.