“ఇశ్రాయేలూ, నీవు తిరిగి వస్తే,
నా దగ్గరకు తిరిగి రండి” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
“నీ అసహ్యమైన విగ్రహాలను నా దృష్టికి దూరంగా ఉంచితే
ఇక దారి తొలగకుండా ఉంటే,
మీరు నిజాయితీ, న్యాయం నీతిగల మార్గంలో ఉండి,
‘సజీవుడైన యెహోవా మీద’ అని ప్రమాణం చేస్తే,
అప్పుడు నిన్ను బట్టి దేశాలు ఆశీర్వాదాలు పొందుతాయి,
వారు యెహోవా పట్ల వారి అభిమానాన్ని చాటుకుంటారు.”