ఆ రోజున ప్రజల వినికిడిలో మోషే గ్రంథం బిగ్గరగా చదువుతూ ఉండగా; అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని సమాజంలోకి ప్రవేశించకూడదని వ్రాయబడిన భాగం కనబడింది, ఎందుకంటే వారు అరణ్యంలో ఇశ్రాయేలీయులకు ఆహారం గాని నీరు గాని తీసుకెళ్లి ఇవ్వలేదు పైగా వారిని శపించడానికి బిలామును నియమించుకున్నారు. అయితే దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చారు.