ఈ మూడవ వంతు ప్రజలను నేను అగ్నిలో నుండి
వెండిని శుద్ధి చేసినట్లు వారిని శుద్ధి చేస్తాను
బంగారాన్ని పరీక్షించినట్లు వారిని పరీక్షిస్తాను.
వారు నా పేరట మొరపెడతారు,
నేను వారికి జవాబిస్తాను.
‘వారు నా ప్రజలు’ అని నేనంటాను,
‘యెహోవా మా దేవుడు’ అని వారంటారు.”