దీనివలన మనము ఆయనయందు నిలిచియున్నామనియు ఆయన మనయందున్నాడనియు తెలిసికొనుచున్నాము; ఏలయనగా ఆయన మనకు తన ఆత్మ లో పాలు దయచేసియున్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పు కొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు. మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు, ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు. తీర్పుదినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి యున్నది; ఏలయనగా ఆయన ఎట్టివాడై యున్నాడో మనము కూడ ఈ లోకములో అట్టివారమై యున్నాము. ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును; భయము దండ నతోకూడినది; భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.
చదువండి 1 యోహాను 4
వినండి 1 యోహాను 4
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 యోహాను 4:13-19
7 రోజులు
నీవు దేవుణ్ణి ఎలా చూస్తావు? ఆ ప్రశ్నకు సమాధానం నిన్నూ, నీ విశ్వాసాన్నీ, స్వీయ-అవగాహనలనూ, వైఖరులనూ, సంబంధాలనూ, లక్ష్యాలనూ – నీ పూర్తి జీవితాన్నీ రూపొందిస్తుంది. దేవుని విషయంలో సరికాని దృక్పథం కలిగి ఉండటం మిమ్మల్ని జీవితకాల పోరాటాలలో చిక్కుకొనేలా చేస్తుంది. అంటే నిజమైన దేవుణ్ణి స్పష్టంగా చూడడం – ఆయనను చూడాలని దేవుడు కోరుకొన్న విధంగా చూడడం – జ్ఞానవంతమైన కార్యం! నీ జీవితం శక్తివంతంగా రూపాంతరం చెందుతుంది!
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు