2 దినవృత్తాంతములు 18
18
1తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు అహాబుతో వియ్యమంది 2కొన్ని సంవత్సరములు గతించినమీదట షోమ్రోనులో నుండు అహాబునొద్దకు పోయెను; అహాబు అతని కొరకును అతని వెంటవచ్చిన జనులకొరకును అనేకమైన గొఱ్ఱెలను పశువులను కోయించి, తనతోకూడ రామోత్గిలాదు మీదికిపోవుటకు అతని ప్రేరేపించెను. 3ఇశ్రాయేలురాజైన అహాబు యూదారాజైన యెహోషాపాతును చూచి–నీవు నాతోకూడ రామోత్గిలాదునకు వచ్చెదవా అని అడుగగా యెహోషాపాతు–నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతోకూడ యుద్ధమునకు వచ్చెదమని చెప్పెను. 4మరియు యెహోషాపాతు ఇశ్రాయేలురాజుతో–నేడు యెహోవాయొద్ద సంగతి విచారణ చేయుదము రండనగా 5ఇశ్రాయేలురాజు నాలుగువందలమంది ప్రవక్తలను సమకూర్చి–నేను రామోత్గిలాదుమీదికి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారి నడిగెను. అందుకువారు–పొమ్ము, దేవుడు రాజు చేతికి దానినప్పగించునని చెప్పిరి. 6అయితే యెహోషాపాతు–మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా? అని యడుగగా 7ఇశ్రాయేలురాజు–యెహోవాయొద్ద విచారణచేయుటకు ఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు; అయితే అతడు నన్నుగూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వానియందు పగ గలిగియున్నాననగా యెహోషాపాతు–రాజు ఆలాగనవద్దనెను. 8అప్పుడు ఇశ్రాయేలురాజు తన పరివారములోనున్న యొకని పిలిపించి–ఇవ్లూ కుమారుడైన మీకాయాను శీఘ్రముగా రప్పించుమని ఆజ్ఞ ఇచ్చెను. 9ఇశ్రాయేలురాజును యూదారాజగు యెహోషాపాతును షోమ్రోను ఊరు గవిని ముందరి బయలునందు తమతమ వస్త్రములను ధరించుకొని తమతమ సింహాసనములమీద కూర్చునియుండగా ప్రవక్తలందరును వారి ముందర ప్రవచించుచుండిరి. 10అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా యినుపకొమ్ములు చేయించుకొనివచ్చి–సిరియనులు నిర్మూల మగువరకు వీటితో వారిని నీవు పొడిచెదవని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించెను. 11ప్రవక్తలందరును ఆప్రకారముగానే ప్రవచించుచు–యెహోవా రామో త్గిలాదును రాజు చేతికి అప్పగించును, దానిమీదికిపోయి జయమొందుము అనిరి. 12మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని–ప్రవక్తలు రాజు విషయమై యేక ముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరచి మేలునే ప్రవ చింపుమనగా 13మీకాయా–యెహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చునదేదో దానినే ప్రవచింతునని చెప్పెను. 14అతడు రాజునొద్దకు రాగా రాజు అతని చూచి–మీకాయా, యుద్ధమునకు రామోత్గిలాదునకు మేము పోవుదుమా, మానుదుమా అని యడుగగా అతడు–పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదురనెను. 15అప్పుడు రాజు–యెహోవా నామమునుబట్టి అబద్ధముకాక సత్యమే పలుకుమని నేను ఎన్నిమారులు నీచేత ఒట్టు పెట్టించుకొందునని అతనితో అనగా 16అతడు–కాపరిలేని గొఱ్ఱెలవలెనే ఇశ్రాయేలు వారందరును పర్వతములమీద చెదరిపోవుట చూచితిని; –వీరికి యజమానుడు లేడనియు, వీరిలో ప్రతివాడు తన తన యింటికి సమాధానముగా పోవలెననియు యెహోవా సెలవిచ్చియున్నాడనెను. 17ఇశ్రాయేలురాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లనెను –ఇతడు కీడునేగాని నా విషయమై మేలును ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని యనగా 18మీకాయా– యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనము మీద ఆసీనుడైయుండుటయు, పరమండల సైన్యమంతయు ఆయన కుడిప్రక్కను ఎడమప్రక్కను నిలువబడుటయు నేను చూచితిని. 19–ఇశ్రాయేలురాజైన అహాబు రామో త్గిలాదుమీదికి పోయి పడిపోవునట్లు ఎవడు అతని ప్రేరేపించునని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి. 20అప్పుడు ఒక ఆత్మవచ్చి యెహోవాయెదుట నిలువబడి–నేను అతని ప్రేరేపించెదనని చెప్పగా యెహోవా–దేనిచేతనని అతని నడిగెను. 21అందుకు ఆయాత్మ–నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందునని చెప్పగా యెహోవా–నీవు అతనిని ప్రేరేపించి జయిం తువు, పోయి ఆప్రకారముగా చేయుమని సెలవిచ్చెను. 22యెహోవా నీ ప్రవక్తలగు వీరినోట అబద్ధములాడు ఆత్మను ఉంచియున్నాడు, యెహోవా నీమీద కీడు పలికించియున్నాడని చెప్పెను.
23అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయాను చెంపమీద కొట్టి–నీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నాయొద్దనుండి ఏ మార్గమున పోయెననెను. 24అందుకు మీకాయా–దాగుటకై నీవు లోపలి గదిలోనికి వెళ్లు దినమున దాని తెలిసికొందువని చెప్పెను. 25అప్పుడు ఇశ్రాయేలురాజు–పట్టణపు అధిపతియైన ఆమోనునొద్దకును రాజు కుమారుడైన యోవాషునొద్దకును –మీరు మీకాయాను తీసికొనిపోయి వారితో రాజు మీకిచ్చిన సెలవు ఇదియే యనుడి, 26–నేను సురక్షితముగా తిరిగి వచ్చువరకు వీనిని చెరలోపెట్టి క్లేశాన్న పానములు ఇయ్యుడి. 27అప్పుడు మీకాయా యిట్ల నెను–నీవు సురక్షితముగా తిరిగి వచ్చినయెడల యెహోవా నా ద్వారా పలుకనే లేదనిచెప్పి, సమస్తజనులారా ఆలకించుడనెను. 28అంతట ఇశ్రాయేలురాజును యూదా రాజైన యెహోషాపాతును రామోత్గిలాదుమీదికి పోయిరి. 29ఇశ్రాయేలురాజు–నేను మారువేషమువేసికొని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషము వేసి కొనెను, తరువాత వారు యుద్ధమునకు పోయిరి. 30సిరియా రాజు–మీరు ఇశ్రాయేలురాజుతోనే యుద్ధము చేయుడి, అధములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతోకూడనున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చియుండెను. 31కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి,గాని యెహోషాపాతు మొఱ్ఱపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను, దేవుడు అతని యొద్దనుండి వారు తొలగిపోవునట్లు చేసెను. 32ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజుకాడని తెలిసికొని అతని తరుముట మాని తిరిగిపోయిరి. 33అప్పుడు ఒకడు గురిచూడకయే తన వింటిని ఎక్కుబెట్టి, ఇశ్రాయేలురాజును అతని కవచపు బందులసందున కొట్టగా అతడు– నాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులోనుండి నన్ను కొనిపొమ్మని తన సారధితో అనెను. 34ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను; అయినను ఇశ్రాయేలురాజు అస్తమయమువరకు సిరియనులకెదురుగా తన రథమునందు నిలిచెను, ప్రొద్దుగ్రుంకువేళ అతడు చని పోయెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 18: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: