2 రాజులు 11
11
1అహజ్యా తల్లియైన అతల్యా తన కుమారుడు మృతి బొందెనని తెలిసికొని లేచి రాజకుమారులనందరిని నాశనము చేసెను. 2రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషెబ అహజ్యా కుమారుడైన యోవాషును, హతమైన రాజకుమారులతోకూడ చంపబడకుండ అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడకగదిలో అతల్యాకు మరుగుగా ఉంచియుండుటచేత అతడు చంపబడకుండెను. 3అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు ఆరుసంవత్సరములు యెహోవామందిరమందు దాదితోకూడ దాచబడి యుండెను.
4ఏడవ సంవత్సరమందు యెహోయాదా కావలికాయు వారిమీదను రాజదేహ సంరక్షకులమీదను ఏర్పడియున్న శతాధిపతులను పిలువనంపించి, యెహోవా మందిరములోనికి వారిని తీసికొనిపోయి, యెహోవామందిరమందు వారిచేత ప్రమాణము చేయించి వారితో నిబంధనచేసి, వారికి ఆ రాజు కుమారుని కనుపరచి యీలాగు ఆజ్ఞాపించెను 5–మీరు చేయవలసినదేమనగా, విశ్రాంతిదినమున లోపల ప్రవేశించు మీరు మూడు భాగములై యొక భాగము రాజమందిరమునకు కావలి కాయువారై యుండవలెను; 6ఒక భాగము సూరు గుమ్మముదగ్గర కాపు చేయవలెను, ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలెను, ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని యుండవలెను. 7మరియు విశ్రాంతిదినమున బయలుదేరు మీయందరిలో రెండు భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై యుండవలెను. 8మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకొని రాజుచుట్టు కాచుకొని యుండవలెను, ఎవడైనను పంక్తులలో ప్రవేశించినయెడల వాని చంపవలెను, రాజు బయలుదేరి సంచరించునప్పుడెల్ల మీరు అతనియొద్ద ఉండవలెను. 9శతాధిపతులు యాజకుడైన యెహోయాదా తమ కిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి, ప్రతి మనిషి తన తన మనుష్యులను తీసికొని విశ్రాంతిదినమున లోపల ప్రవేశింపవలసిన వారితోను, విశ్రాంతిదినమున బయలుదేరవలసిన వారితోను కలిసి యాజకుడైన యెహోయాదా యొద్దకు వచ్చెను. 10యాజకుడు మందిరములో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా 11కాపు కాయువారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకొని బలిపీఠముచెంతను మందిరముచెంతను మందిరము కుడికొన మొదలుకొని యెడమకొనవరకు రాజుచుట్టు నిలిచిరి. 12అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొనిపోయి అతని తలమీద కిరీటము పెట్టి, ధర్మశాస్త్రగ్రంథమును అతనిచేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లుకొట్టి–రాజు చిరంజీవి యగునుగాకని చాటించిరి. 13అతల్యా, కాయువారును జనులును కేకలువేయగా విని, యెహోవామందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి 14రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభముదగ్గర నిలుచుటయు, అధిపతులును బాకా ఊదువారును రాజునొద్ద నిలువబడుటయు, దేశపు వారందరును సంతోషించుచు శృంగధ్వనిచేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని – ద్రోహము ద్రోహము అని కేక వేయగా 15యాజకుడైన యెహోయాదా సైన్యములోని శతాధిపతులకు – యెహోవామందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తుల బయటికి ఆమెను వెళ్లగొట్టుడి; ఆమె పక్షపువారిని ఖడ్గముచేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక 16రాజమందిరములోనికి గుఱ్ఱములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్లిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి.
17అప్పుడు యెహోయాదా–జనులు యెహోవావారని ఆయన పేరట రాజుతోను జనులతోను నిబంధన చేయిం చెను, మరియు అతడు రాజుపేరట జనులతో నిబంధన చేయించెను. 18అప్పుడు దేశపు జనులందరును బయలు గుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతి మలను ఛిన్నాభిన్నములుచేసి, బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకొనుటకు మనుష్యులను నియమించెను. 19అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయువారిని దేశపు జనులందరిని పిలిపింపగా వారు యెహోవా మందిరములోనున్న రాజునుతీసికొని, కాపుకాయువారి గుమ్మపు మార్గమున రాజనగరునకు రాగా రాజు సింహాసనముమీద ఆసీనుడాయెను. 20మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గముచేత చంపిన తరువాత దేశపు జనులందరును సంతోషించిరి, పట్టణమును నిమ్మళముగా ఉండెను. 21యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు ఏడేండ్లవాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 రాజులు 11: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: