2 సమూయేలు 23
23
1దావీదు రచించిన చివరి మాటలు ఇవే; యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి యిదే; యాకోబు దేవునిచేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును ఇశ్రాయేలీయుల స్తోత్రగీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి యిదే.
2యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది.
3ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగువాడు నాద్వారా మాటలాడుచున్నాడు. –మనుష్యులను ఏలు నొకడు పుట్టును అతడు నీతిమంతుడై దేవునియందు భయభక్తులు గలిగియేలును.
4ఉదయకాలపు సూర్యోదయ కాంతివలెను మబ్బులేకుండ ఉదయించిన సూర్యునివలెను వర్షము కురిసినపిమ్మట నిర్మలమైన కాంతిచేత భూమిలోనుండి పుట్టిన లేత గడ్డివలెను అతడు ఉండును.
5నా సంతతివారు దేవునిదృష్టికి అనుకూలురే గదా ఆయన నాతో నిత్యనిబంధన చేసియున్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయెను, దేవునికి పూర్ణానుకూలము అది నాకనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును.
6ఒకడు ముండ్లను చేతపట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు.
7ముండ్లను పట్టుకొనువాడు ఇనుపపనిముట్టునైనను బల్లెపు కోలనైనను వినియోగించును గదా మనుష్యులు వాటిలో దేనిని విడువక అంతయు ఉన్నచోటనే కాల్చివేయుదురు.
8దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనగా యోషే బెష్షెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు; అతడు ఒక యుద్ధములో ఎనిమిది వందలమందిని హతము చేసెను. 9ఇతని తరువాతివాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు, ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడివచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను తిరస్కరించి డీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లిపోగా ఇతడు లేచి 10చేయి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవువరకు ఫిలిష్తీయులను హతము చేయుచు వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడుసొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతనివెనుక వచ్చిరి. 11ఇతని తరువాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా; ఫిలిష్తీయులు అలసందెల చేనిలో గుంపుకూడగా జనులు ఫిలిష్తీయులయెదుట నిలువలేక పారిపోయిరి. 12అప్పుడితడు ఆ చేనిమధ్యను నిలిచి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండ వారిని వెళ్లగొట్టి వారిని హతము చేయుటవలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగ జేసెను. 13మరియు ముప్పదిమంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు నొద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో దండు దిగియుండిరి, 14దావీదు దుర్గములో నుండెను, ఫిలిష్తీయుల దండు కావలివారు బేత్లెహేములో ఉండిరి. 15దావీదు–బేత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడై నను నాకు తెచ్చి యిచ్చినయెడల ఎంతో సంతోషించెదనని అధికారితో పలుకగా 16ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలివారిని ఓడించి, దారి చేసికొనిపోయి బేత్లెహేము గవిని దగ్గరనున్న బావినీళ్లు చేది దావీదునొద్దకు తీసికొనివచ్చిరి; అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సులేక యెహోవా సన్నిధిని పారబోసి –యెహోవా, నేను ఇవి త్రాగను; 17ప్రాణమునకు తెగించి పోయి తెచ్చినవారి చేతి నీళ్లు త్రాగుదునా? అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. 18సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అబీషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడొక యుద్ధములో మూడువందలమందిని హతముచేసి వారిమీద తన యీటెను ఆడించెను. ఇతడు ఆ ముగ్గు రిలో పేరుపొందినవాడు. 19ఇతడు ఆ ముప్పదిమందిలో ఘనుడై వారికి అధిపతి యాయెనుగాని మొదటి ముగ్గు రితో సమానుడు కాకపోయెను. 20మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియలచేత ఘనతనొందిన యొక పరాక్రమ శాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను నొకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులగు ఆ యిద్దరు శూరులను హతముచేసెను; మరియు మంచుకాలమున బయలువెడలి బావిలో దాగి యున్న యొక సింహమును చంపి వేసెను. 21ఇంకను అతడు సౌందర్యవంతుడైన యొక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటెయుండగా బెనాయా దుడ్డుకఱ్ఱ తీసికొని వానిమీదికి పోయి వాని చేతిలోని యీటె ఊడలాగి దానితోనే వాని చంపెను. 22ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోను అతడు పేరుపొంది 23ఆ ముప్పదిమందిలో ఘనుడాయెను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను.
24ఆ ముప్పదిమంది యెవరనగా, యోవాబు సహోదరుడైన అశాహేలు, బేత్లెహేమీయుడగు దోదో కుమారుడగు ఎల్హానాను, 25హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా, 26పల్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా, 27అనాతోతీయుడైన అబీ యెజరు, హుషాతీయుడైన మెబున్నయి, 28అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై 29నెటోపా తీయుడైన బయానాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఇత్తయి, 30పిరాతోనీయుడైన బెనాయా, గాయషు ఏళ్లనడుమ నివసించు హిద్దయి, 31అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు, 32షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేనుయొక్క కుమారులలో యోనాతాను, 33హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారునకు పుట్టిన అహీయాము, 34మాయాకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడైన ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడగు ఏలీయాము, 35కర్మెలీయుడైన హెస్రై, అర్బీయుడైన పయరై, 36సోబావాడగు నాతానుయొక్క కుమారుడైన ఇగాలు, గాదీయుడైన బానీ, 37అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, యితడు సెరూయా కుమారుడగు యోవాబుయొక్క ఆయుధములను మోయువాడై యుండెను. 38-39ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా. వారందరు ముప్పదియేడుగురు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 సమూయేలు 23: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: