ద్వితీయోపదేశకాండము 32
32
1ఆకాశమండలమా, చెవినొగ్గుము; నేను మాటలాడుదును
భూమండలమా, నా నోటిమాట వినుము.
2నా ఉపదేశము వానవలె కురియును
నా వాక్యము మంచువలెను
లేతగడ్డిమీద పడు చినుకులవలెను
పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును.
3నేను యెహోవా నామమును ప్రకటించెదను
మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి.
4ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన
కార్యము సంపూర్ణము
ఆయన చర్యలన్నియు న్యాయములు
ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు.
ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.
5వారు తమ్ము చెరుపుకొనిరి; ఆయన పుత్రులుకారు;వారు కళంకులు
మూర్ఖతగల వక్రవంశము.
6బుద్ధిలేని అవివేకజనమా,
ఇట్లు యెహోవాకు ప్రతికారము చేయుదురా?
ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా?
ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను.
7పూర్వదినములను జ్ఞాపకము చేసికొనుము
తరతరముల సంవత్సరములను తలంచుకొనుము
నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును;
నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు.
8మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభా గించినప్పుడు
నరజాతులను ప్రత్యేకించినప్పుడు
ఇశ్రాయేలీయుల లెక్కనుబట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను.
9యెహోవా వంతు ఆయన జనమే
ఆయన స్వాస్థ్యభాగము యాకోబే.
10అరణ్యప్రదేశములోను
భీకరధ్వనిగల పాడైన యెడారిలోను
వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను.
11పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు
రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల
మీద వాటిని మోయునట్లు
యెహోవా వానిని నడిపించెను.
12యెహోవా మాత్రము వాని నడిపించెను
అన్యులయొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతోకూడ ఉండలేదు.
13భూమియొక్క ఉన్నతస్థలములమీద వాని నెక్కిం చెను
పొలముల పంట వానికి తినిపించెను
కొండబండనుండి తేనెను
చెకుముకి రాతిబండనుండి నూనెను
అతనికి జుఱ్ఱించెను.
14ఆవు మజ్జిగను గొఱ్ఱెమేకల పచ్చిపాలను
గొఱ్ఱెపిల్లల క్రొవ్వును బాషాను పొట్టేళ్లను మేకలను
గోధుమల మెరికెల సారమును నీకిచ్చెను.
నీవు త్రాగిన మద్యము ద్రాక్షలరసము.
15యెషూరూను#32:15 ఇశ్రాయేలు. క్రొవ్వినవాడై కాలు జాడించెను
నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి.
వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను
తన రక్షణ శైలమును తృణీకరించెను.
16వారు అన్యుల దేవతలచేత ఆయనకు రోషము పుట్టించిరి
హేయకృత్యములచేత ఆయనను కోపింపజేసిరి
17వారు దేవత్వములేని దయ్యములకు
తామెరుగని దేవతలకు
క్రొత్తగా పుట్టిన దేవతలకు
తమపితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి.
18నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి.
నిన్ను కనిన దేవుని మరచితివి.
19యెహోవా దానిని చూచెను.
తన కుమారులమీదను కుమార్తెలమీదను క్రోధపడెను
వారిని అసహ్యించుకొనెను.
20ఆయన ఇట్లనుకొనెను–
నేను వారికి విముఖుడనై వారి కడపటిస్థితి యేమగునో చూచెదనువారు మూర్ఖచిత్తముగలవారు విశ్వాసములేని పిల్లలు.
21వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టిం చిరి
తమ వ్యర్థప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి
కాబట్టి జనముకానివారివలన వారికి రోషము పుట్టిం తును
అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును.
22నా కోపాగ్ని రగులుకొనును
పాతాళాగాధమువరకు అది దహించును
అది భూమిని దాని పంటను కాల్చును
పర్వతముల పునాదులను రవులబెట్టును.
23వారికి ఆపదలను విస్తరింపజేసెదనువారిమీద నా బాణములన్నిటిని వేసెదను.
24వారు కరవుచేత క్షీణించుదురు
మంటచేతను క్రూరమైన హత్యచేతను హరించి పోవుదురు
బురదలో ప్రాకు పాముల విషమును
మృగముల కోరలను వారిమీదికి రప్పించెదను.
25బయట ఖడ్గమును లోపట భయమును
యౌవనులను కన్యకలను శిశువులను నెరిసిన తలవెండ్రు
కలు గలవారిని నశింపజేయును.
26వారిని దూరమునకు చెదరగొట్టెదను
27వారి పేరు మనుష్యులలోలేకుండచేసెదననుకొందునువారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో
–ఇదంతయు యెహోవా చేసినదికాదు
మా బలముచేత వారిని గెలిచితిమి అని వారనుకొందురేమో
విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు.
28వారు ఆలోచనలేని జనమువారిలో వివేచనలేదు.
29వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి
స్థితి యోచించుట మేలు.
30తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయనియెడల
యెహోవావారిని అప్పగింపనియెడల
ఒక్కడు ఎట్లు వేయిమందిని తరుమును?
ఇద్దరు ఎట్లు పదివేలమందిని పారదోలుదురు?
31వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గమువంటిది కాదు
ఇందుకు మన శత్రువులే తీర్పరులు.
32వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి
అది గొమొఱ్ఱా పొలములలో పుట్టినది.
వారి ద్రాక్షపండ్లు పిచ్చి ద్రాక్షపండ్లు
వాటి గెలలు చేదైనవి.
వారి ద్రాక్షారసము క్రూరసర్పముల విషము
నాగుపాముల క్రూరవిషము.
33ఇది నాయొద్ద మరుగుపడి యుండలేదా?
నా నిధులలో ముద్రింపబడి యుండలేదా?
34వారి కాలు జారుకాలమున
పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే;
35వారి ఆపద్దినము సమీపించునువారి గతి త్వరగా వచ్చును.
36వారి కాధారము లేకపోవును.
37నిర్బంధింపబడినవాడును స్వతంత్రుడును లేకపోవును
యెహోవా చూచును
తన సేవకులనుగూర్చి సంతాపపడును.
38నిజముగా తన ప్రజలకు తీర్పుచేయును.
ఆయన–వారి నైవేద్యముల క్రొవ్వునుతిని వారి పానీ
యార్పణమైన ద్రాక్షారసమును త్రాగినవారి దేవత లేమైరి?వారు ఆశ్రయించిన దుర్గములే
లేచి మీకు సహాయము చేయవచ్చునువారు మీకు శరణము కానియ్యుడి అని చెప్పును.
39ఇదిగో నేను నేనే దేవుడను
నేను తప్ప వేరొక దేవుడు లేడు
మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే
గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే
నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు
40-41నేను తళతళలాడు నా ఖడ్గము నూరి
నా చేత న్యాయమును పట్టుకొనినయెడల
నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసెదను
నన్ను ద్వేషించువారికి ప్రతిఫలమిచ్చెదను
రక్తముచేత నా బాణములను మత్తిల్ల చేసెదను.
42చంపబడినవారి రక్తమును చెరపట్టబడినవారి రక్తమును
శత్రువులలో వీరుల తలలను
నా ఖడ్గము భక్షించును
నేను ఆకాశముతట్టు నా హస్తమెత్తి నా శాశ్వత
జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను.
43జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి.
హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతి దండన చేయును
తన విరోధులకు ప్రతీకారము చేయును
తన దేశము నిమిత్తమును తన ప్రజలనిమిత్తమును
ప్రాయశ్చిత్తము చేయును.
44మోషేయు నూను కుమారుడైన యెహోషువయు#32:44 హోషేయ. ఈ కీర్తన మాటలన్నియు ప్రజలకు వినిపించిరి. 45మరియు మోషే యీ మాటలన్నియు ఇశ్రాయేలీయులందరితో చెప్పి చాలించి 46మరల వారితో ఇట్లనెను–మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటిని మీ మన స్సులలో పెట్టుకొని, మీ సంతతివారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనవలెనని వారికాజ్ఞాపింపవలెను. 47ఇది మీకు నిరర్థకమైన మాటకాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోవుచున్న దేశములో దీనినిబట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు.
48-49ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను– యెరికో యెదుటనున్న మోయాబుదేశమందలి అబారీమను ఈ పర్వతము, అనగా నెబోకొండ యెక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి 50నీ సహోదరుడైన అహరోను హోరు కొండమీద మృతిబొంది తన స్వజనులయొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోవుచున్న కొండమీద మృతిబొంది నీ స్వజనులయొద్దకు చేరుదువు. 51ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేషు మెరీబా నీళ్లయొద్ద ఇశ్రాయేలీయులమధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయులమధ్యను నామీద తిరుగుబాటు చేసితిరి. 52ఎదురుగా ఆ దేశమును చూచెదవు కాని నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ద్వితీయోపదేశకాండము 32: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: