యెహెజ్కేలు 40
40
1మనము చెరలోనికి వచ్చిన యిరువదియైదవ సంవత్సరము మొదటి నెల పదియవ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన పదునాలుగవ సంవత్సరమున ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయెను. 2దేవుని దర్శనవశుడనైన నన్ను ఇశ్రాయేలీయుల దేశములోనికి తోడుకొని వచ్చి, మిగుల ఉన్నతమైన పర్వతముమీద ఉంచెను. దానిపైన దక్షిణపుతట్టున పట్టణమువంటి దొకటి నాకగు పడెను. 3అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడుండెను. ఆయన మెరయుచున్న యిత్తడి వలె కనబడెను, దారమును కొలకఱ్ఱయు చేతపట్టుకొని ద్వారములో ఆయన నిలువబడియుండెను. 4ఆ మనుష్యుడు నాతో ఇట్లనెను–నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటినన్నిటిని కన్నులార చూచి చెవులార విని మనస్సులో ఉంచుకొనుము; నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటికి తేబడితివి, నీకు కనబడు వాటినన్నిటిని ఇశ్రాయేలీయులకు తెలియజేయుము.
5నేను చూడగా నలుదిశలమందిరముచుట్టు ప్రాకార ముండెను, మరియు ఆ మనుష్యునిచేతిలో ఆరు మూరల కొలకఱ్ఱయుండెను, ప్రతిమూర మూరెడు బెత్తెడు నిడివి గలది, ఆయన ఆ కట్టడమును కొలువగా దాని వెడల్పును దాని యెత్తును బారన్నర తేలెను. 6అతడు తూర్పుతట్టున నున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానములమీది కెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు, అనగా మొదటి గడప వెడల్పు బారన్నర తేలెను. 7మరియు కావలిగది నిడివియు వెడల్పును బారన్నర, కావలి గదులకు మధ్య అయిదేసి మూరల యెడముండెను. గుమ్మముయొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకు బారన్నర యెడము. 8గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువగా బారన్నర తేలెను. 9గుమ్మపు ద్వారము కొలువగా అది యెనిమిది మూరలై యుండెను, దానిస్తంభములు రెండేసి మూరలు; అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను. 10తూర్పు గుమ్మపు ద్వారముయొక్క కావలి గదులు ఇటు మూడును, అటు మూడును ఉండెను, మూడు గదులకు కొలత యొకటే. మరియు రెండు ప్రక్కలనున్న స్తంభములకు కొలత యొకటే. 11ఆయా గుమ్మముల వాకిండ్లు కొలువగా వాటి వెడల్పు పది మూరలును నిడివి పదుమూడు మూరలును తేలెను. 12కావలి గదులముందర మూరెడు ఎత్తుగల గోడ ఇరుప్రక్కల నుండెను, ఆ ప్రక్కను ఈ ప్రక్కను మూరెడు ఎత్తుగల గోడ యుండెను; గదులైతే ఇరుప్రక్కలను ఆరుమూరల ఎత్తుగలవి. 13ఒకగది కప్పునుండి రెండవదాని కప్పువరకు గుమ్మమును కొలువగా ఇరువదియయిదు మూరల వెడల్పు తేలెను, రెండు వాకిండ్లమధ్య గోడను అదే కొలత. 14అరువదేసి మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడెను. గుమ్మము చుట్టునున్న ఆవరణము స్తంభములవరకు వ్యాపించెను. 15బయటి గుమ్మమునొద్దనుండి లోపటి గుమ్మపుద్వారమువరకు ఏబదిమూరలు. 16కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టు నున్న గోడలకును ప్రక్కగదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను, గోడలోని స్తంభములకును కిటికీలుండెను; ప్రతి స్తంభముమీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి యుండెను.
17అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసికొనిరాగా అచ్చట గదులును చప్టాయు కనబడెను. చప్టామీద ముప్పది చిన్నగదులు ఏర్పడియుండెను. 18ఈ చప్టా గుమ్మములవరకుండి వాటి వెడల్పున సాగియుండెను. అది క్రింది చప్టా ఆయెను. 19క్రింది గుమ్మము మొదలుకొని లోపలి ఆవరణమువరకు ఆయన వెడల్పు కొలువగా ఇది తూర్పునను ఉత్తరమునను నూరు మూరలాయెను. 20మరియు ఉత్తరపువైపున బయటి ఆవరణము చూచుచుండు గుమ్మపు నిడివిని వెడల్పును 21దాని ఇరుప్రక్కలనున్న మూడేసి కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్యగోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడెను, అనగా నిడివి ఏబదిమూరలు వెడల్పు ఇరువదియైదుమూరలు కనబడెను. 22వాటి కిటికీలును వాటి మధ్యగోడలును ఖర్జూరపుచెట్లవలె రూపింప బడిన వాటి అలంకారమును తూర్పుద్వారముయొక్క కొలత ప్రకారముగా కనబడెను మరియు ఎక్కుటకై యేడు మెట్లుండెను, ఎదుటనుండి దాని మధ్యగోడలు కనబడుచుండెను. 23ఉత్తరద్వారమున కెదురుగా ఒక టియు, తూర్పుద్వారమున కెదురుగా ఒకటియు, లోపటి ఆవరణమునకు పోవు రెండు గుమ్మములుండెను. ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు ఎంతైనది అతడు కొలువగా నూరుమూరల యెడము కనబడెను. 24అతడు నన్ను దక్షి ణపుతట్టునకు తోడుకొని పోగా దక్షిణపుతట్టున గుమ్మ మొకటి కనబడెను. దాని స్తంభములను మధ్యగోడలను కొలువగా అదే కొలత కనబడెను. 25మరియు వాటి కున్నట్టుగా దీనికిని దీని మధ్యగోడలకును చుట్టు కిటికీ లుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరవదియైదు మూరలు. 26ఎక్కుటకు ఏడు మెట్లును ఎదురుగా కనబడు మధ్యగోడలును ఉండెను. మరియు దాని స్తంభముల ఇరుప్రక్కలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారముండెను 27లోపటి ఆవరణమునకు దక్షిణపుతట్టున గుమ్మమొకటి యుండెను, దక్షిణపుతట్టును గుమ్మమునుండి గుమ్మమువరకు ఆయన కొలువగా నూరు మూరలాయెను.
28అతడు దక్షిణమార్గమున లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను; దాని కొలత అదే. 29మరియు దాని కావలిగదులును స్తంభములును మధ్య గోడలును పైచెప్పిన కొలతకు సరిపడెను; దానికిని దాని చుట్టు ఉన్న మధ్యగోడలకును కిటికీ లుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు 30చుట్టు మధ్యగోడల నిడివి ఇరువది యైదు మూరలు, వెడల్పు అయిదు మూరలు. 31దాని మధ్య గోడలు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను. 32తూర్పుతట్టు లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దాని గుమ్మమును ఆయన కొలువగా పైచెప్పిన కొలత తేలెను. 33దాని కావలిగదులకును స్తంభములకును మధ్యగోడలకును కొలత అదే; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కిటికీలుండెను; నిడివి యేబది మూరలు, వెడల్పు ఇరువది యైదు మూరలు. 34దాని మధ్యగోడలు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను. ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకార ముండెను, ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను. 35ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకొనిపోయి దాని కొలు వగా అదే కొలత యాయెను. 36దాని కావలిగదులకును స్తంభములకును దాని మధ్యగోడలకును అదే కొలత; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కిటికీలుండెను; దాని నిడివి యేబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు. 37దాని స్తంభములు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; ఆ స్తంభములమీద ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఖర్జూరపు చెట్లనుపోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.
38గుమ్మముల స్తంభములయొద్ద వాకిలిగల గదియుండెను; అక్కడ దహనబలి పశువుల మాంసము కడుగుదురు. 39మరియు గుమ్మపు మంటపములో ఇరుప్రక్కల రెండేసి బల్లలుంచబడెను; వీటిమీద దహనబలి పశువులును పాప పరిహారార్థబలిపశువులును అపరాధపరిహారార్థబలిపశువులును వధింపబడును. 40గుమ్మముయొక్క వాకిలిదగ్గర ఉత్తరపుదిక్కున మెట్లు ఎక్కుచోటున ఇరుప్రక్కల రెండేసి బల్లలుండెను. అనగా గుమ్మపు రెండుప్రక్కల నాలుగేసి బల్లలుండెను. ఇవి పశువులను వధించుటకై ఉంచబడి యుండెను. 41-42దహనబలి పశువులు మొదలగు బలిపశువులను వధించుటకై వినియోగించు ఉపకరణము లుంచదగిన యెనిమిది బల్లలు ఈతట్టు నాలుగు ఆతట్టు నాలుగు మెట్లదగ్గర నుండెను. అవి మూరెడున్నర నిడి వియు మూరెడున్నర వెడల్పును మూరెడు ఎత్తును గలిగి మలిచిన రాతితో చేయబడి యుండెను. 43చుట్టుగోడకు అడుగడుగు పొడుగుగల మేకులు నాటబడియుండెను; అర్పణ సంబంధమైన మాంసము బల్లలమీద ఉంచుదురు. 44లోపటి గుమ్మము బయట లోపటి ఆవరణములో ఉత్తరపు గుమ్మముదగ్గరనుండి దక్షిణముగా చూచు నొకటియు, తూర్పు గుమ్మము దగ్గరనుండి ఉత్తరముగా చూచు నొక టియు రెండు గదులుండెను. 45అప్పుడతడు నాతో ఇట్లనెను–దక్షిణపుతట్టు చూచు గది మందిరమునకు కావలి వారగు యాజకులది. 46ఉత్తరపుతట్టు చూచు గది బలిపీఠమునకు కావలివారగు యాజకులది. వీరు లేవీయులలో సాదోకు సంతతివారై సేవచేయుటకై యెహోవా సన్ని ధికి వచ్చువారు. 47అతడు ఆ ఆవరణమును కొలువగా నిడివియు వెడల్పును నూరుమూరలై చచ్చౌకముగా ఉండెను. మందిరమునకు ఎదురుగా బలిపీఠముంచబడెను.
48అతడు మందిరముయొక్క మంటపములోనికి నన్ను తోడుకొని వచ్చి మంటప స్తంభములను ఒక్కొక్కదాని కొలువగా అది ఇరుప్రక్కల అయిదేసి మూరలుండెను, గుమ్మము ఇరుప్రక్కల మూడేసి మూరల వెడల్పు. 49మంటపమునకు నిడివి యిరువది మూరలు; ఎక్కుటకై యుంచబడిన మెట్లదగ్గర దాని వెడల్పు పదకొండు మూరలు, స్తంభములదగ్గర ఇరు ప్రక్కల ఒక్కొక్కటిగా కంబములుంచబడెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 40: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: