హెబ్రీయులకు 8
8
1మేము వివరించుచున్న సంగతులలోని సారాంశ మేదనగా, 2మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు,#8:2 మూలభాషలో–పరిశుద్ధ వస్తువులకు. అనగా మనుష్యుడుకాక ప్రభువే సాప్థిచిన నిజమైన గుడారమునకు పరిచారకుడై యుండి, పరలోకమందు మహామహుని#8:2 మూలభాషలో–మహాత్మ్యముయొక్క. సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. 3ప్రతి ప్రధానయాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైన ఉండుట అవశ్యము. 4ధర్మశాస్త్రప్రకారము అర్పణలు అర్పించువారున్నారు గనుక ఈయన భూమిమీద ఉన్నయెడల యాజకుడై యుండడు. 5మోషే గుడారము అమర్చబోయినప్పుడు
–కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున
సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము
అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు. 6ఈయనయైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేప్ఠమైన సేవకత్వము పొంది యున్నాడు. 7ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవదానికి అవకాశముండనేరదు. 8అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు
–ప్రభువు ఇట్లనెను–ఇదిగో యొక కాలమువచ్చుచున్నది.
అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోను
యూదా ఇంటివారితోను
నేను క్రొత్తనిబంధన చేయుదును.
9అది నేను ఐగుప్తుదేశములోనుండి
వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై
వారిని చెయ్యి పట్టుకొనిన దినమునవారితో నేను చేసిన నిబంధనవంటిది కాదు.
ఏమనగా–వారు నా నిబంధనలో నిలువలేదు
గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని
ప్రభువు చెప్పుచున్నాడు.
10ఆ దినములైన తరువాత
ఇశ్రాయేలు ఇంటివారితో
నేను చేయబోవు నిబంధన యేదనగా,వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను
వారి హృదయములమీద వాటిని వ్రాయుదును
నేను వారికి దేవుడునై యుందునువారు నాకు ప్రజలైయుందురు.వారిలో ఎవడును
11–ప్రభువును తెలిసికొనుడని
తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను
ఉపదేశముచేయడు
వారిలో చిన్నలు మొదలుకొని పెద్దలవరకు
అందరును నన్ను తెలిసికొందురు.
12నేను వారి దోషముల విషయమై దయగలిగివారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసి
కొననని
ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
13ఆయన క్రొత్తనిబంధన అని చెప్పుటచేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు#8:13 మూలభాషలో–నివర్తనమగుటకు. సిద్ధముగా ఉన్నది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
హెబ్రీయులకు 8: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: