యెషయా 11
11
1యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును
వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును
2యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ
ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ
తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు
ఆత్మ అతనిమీద నిలుచును
3-4యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా
ఉండును.
కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు
తాను వినుదానినిబట్టి విమర్శచేయడు
నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును
భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శ
చేయును
తన వాగ్దండముచేత లోకమును కొట్టును
తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును
5అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును
నడికట్టుగా ఉండును.
6తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును
చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును
దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు
కూడుకొనగా
బాలుడు వాటిని తోలును.
7ఆవులు ఎలుగులు కూడి మేయును
వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును
ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును.
8పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద#11:8 లేక, పాముకంటిపాపను తన వ్రేలితో ముట్టుకొనును. ఆటలాడును
మిడినాగు పుట్టమీద పాలువిడచిన పిల్ల తన చెయ్యిచాచును
9నా పరిశుద్ధపర్వతమందంతటను ఏ మృగమును హాని
చేయదు నాశముచేయదు
సముద్రము జలముతో నిండియున్నట్టు
లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండును.
10ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు
యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ
చేయును
ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును.
11ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును
అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు
పత్రోసులోనుండియు కూషులోనుండియు
ఏలాములోనుండియు షీనారులోనుండియు
హమాతులోనుండియు సముద్రద్వీపములలోనుండియు
విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన
చెయ్యి చాచును
12జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువ
బెట్టును
భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును
భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరి
పోయిన యూదా వారిని సమకూర్చును.
13ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును
యూదా విరోధులు నిర్మూలమగుదురు
ఎఫ్రాయిము యూదాయందు మత్సరపడడు
యూదా ఎఫ్రాయిమును బాధింపడు
14వారు ఫిలిష్తీయుల భుజముమీద ఎక్కుదురు
పడమటివైపుకు పరుగెత్తిపోవుదురు
ఏకీభవించి తూర్పువారిని దోచుకొందురు
ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు
అమ్మోనీయులు వారికి లోబడుదురు
15మరియు యెహోవా ఐగుప్తు సముద్రముయొక్క
అఖాతమును నిర్మూలము చేయును
వేడిమిగల తన ఊపిరిని ఊదును
యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును
ఏడు కాలువలుగా దాని చీలగొట్టును
పాదరక్షలు తడువకుండ మనుష్యులు దాటునట్లు దాని
చేయును.
16కావున ఐగుప్తుదేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన
దినమున వారికి దారి కలిగినట్లు
అష్షూరునుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు
రాజమార్గముండును
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 11: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: