యెషయా 13

13
1ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోనుగూర్చి
ప్రత్యక్షమైన దేవోక్తి–
2జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు
చెట్లులేని కొండమీద ధ్వజము నిలువబెట్టుడి
ఎలుగెత్తి వారిని పిలువుడి సంజ్ఞ చేయుడి.
3నాకు ప్రతిష్ఠితులైనవారికి నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను
నాకోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలు
రను పిలిపించియున్నాను
నా ప్రభావమునుబట్టి హర్షించువారిని పిలిపించి
యున్నాను.
4బహుజనులఘోషవలె కొండలలోని జనసమూహము
వలన కలుగు శబ్దము వినుడి
కూడుకొను రాజ్యముల జనములుచేయు అల్లరి
శబ్దము వినుడి
సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధమునకై తన
సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు
5సర్వలోకమును పాడుచేయుటకై
ఆయన దూరదేశమునుండి ఆకాశ దిగంతముల
నుండి
యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధ
ములును వచ్చుచున్నారు.
6యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి
అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి
వచ్చును.
7అందుచేత బాహువులన్నియు దుర్బలములగును
ప్రతివాని గుండె కరగిపోవును
8జనులు విభ్రాంతినొందుదురు
వేదనలు దుఃఖములు వారికి కలుగును
ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు
ఒకరినొకరు తేరి చూతురువారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును.
9యెహోవా దినము వచ్చుచున్నది.
దేశమును పాడుచేయుటకును
పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుట
కును
క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపము
తోను అది వచ్చును.
10ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ
వెలుగు ప్రకాశింపనియ్యవు
ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును
చంద్రుడు ప్రకాశింపడు.
11లోకుల చెడుతనమునుబట్టియు
దుష్టుల దోషమునుబట్టియు నేను వారిని శిక్షింపబోవు
చున్నాను
అహంకారుల అతిశయమును మాన్పించెదను
బలాత్కారుల గర్వమును అణచివేసెదను.
12బంగారుకంటె మనుష్యులును
ఓఫీరు దేశపు సువర్ణముకంటె నరులును
అరుదుగా ఉండ జేసెదను.
13సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతకును
ఆయన కోపాగ్ని దినమునకును
ఆకాశము వణకునట్లును భూమి తన స్థానము తప్పు
నట్లును నేను చేసెదను.
14అప్పుడు తరుమబడుచున్న జింకవలెను
పోగుచేయని గొఱ్ఱెలవలెను
జనులు తమతమ స్వజనులతట్టు తిరుగుదురు
తమతమ స్వదేశములకు పారిపోవుదురు.
15పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును
తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును
16వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగ
గొట్టబడుదురు
వారి యిండ్లు దోచుకొనబడునువారి భార్యలు చెరుపబడుదురు.
17వారిమీద పడుటకు నేను మాదీయులను రేపెదను
వీరు వెండిని లక్ష్యము చేయరు సువర్ణము కూడ వారికి
రమ్యమైనది కాదు
18వారి విండ్లు యౌవనస్థులను నలుగగొట్టును
గర్భఫలమందువారు జాలిపడరు
పిల్లలను చూచి కరుణింపరు.
19అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశ
యాస్పదమును మాహాత్మ్యమునగు బబులోను
దేవుడు పాడుచేసిన సొదొమ గొమొఱ్ఱాలవలెనగును.
20అది మరెన్నడును నివాసస్థలముగా నుండదు
తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు
అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము
వేయడు
గొఱ్ఱెలకాపరులు తమ మందలను అక్కడ పరుండ
నియ్యరు
21నక్కలు అక్కడ పండుకొనును
గురుపోతులు వారి యిండ్లలో ఉండును
నిప్పుకోళ్లు అక్కడ నివసించును
కొండమేకలు అక్కడ గంతులు వేయును
22వారి నగరులలో నక్కలును వారి సుఖవిలాసమందిర
ములలో అడవికుక్కలును మొరలిడును
ఆ దేశమునకు కాలము సమీపించియున్నది
దాని దినములు సంకుచితములు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 13: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి