యెషయా 40

40
1మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా,
2–నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి
యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి
ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను
ఆమె దోషరుణము తీర్చబడెను
యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల
నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము
ఆమెకు ప్రకటించుడి.
3ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు
ఎట్లనగా–అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధ
పరచుడి
ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము
చేయుడి.
4ప్రతి లోయను ఎత్తు చేయవలెను
ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను
వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండ
వలెను.
5యెహోవా మహిమ బయలుపరచబడును
ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు
ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
6ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చు
చున్నాడు
–నేనేమి ప్రకటింతునని మరియొకడడుగుచున్నాడు.
సర్వశరీరులు గడ్డియై యున్నారు
వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది
7యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి
యెండును పువ్వువాడును
నిశ్చయముగా జనులు గడ్డివంటివారే.
8గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును
మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.
9సీయోనూ, సువార్త ప్రకటించుచున్నదానా,
ఉన్నతపర్వతము ఎక్కుము
యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా,
బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి
–ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు
ప్రకటించుము.
10ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా
ప్రభువగు యెహోవా తానే శక్తిసంపన్నుడై
వచ్చును
ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనున్నది
ఆయనచేయు ప్రతికారము ఆయనకు ముందుగా
నడచుచున్నది.
11గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును
తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున
ఆనించుకొని మోయును
పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.
12తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు?
జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు?
భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు?
త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు?
తూనికచేత కొండలను తూచినవాడెవడు?
13యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు?
ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు?
14ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను?
ఆయనకు వివేకము కలుగజేసినవాడెవడు?
న్యాయమార్గమునుగూర్చి ఆయనకు నేర్పినవాడెవడు?
ఆయనకు జ్ఞానమును ఆభ్యసింపజేసినవాడెవడు?
ఆయనకు బుద్ధిమార్గము బోధించినవాడెవడు?
15జనములు చేదనుండి జారు బిందువులవంటివి
జనులు త్రాసుమీది ధూళివంటివారు
ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులవలె నున్నవి.
16సమిధలకు లెబానోను చాలకపోవును
దహనబలికి దాని పశువులు చాలవు
17ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానేయుండును
ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను
ఎంచబడును.
18కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు?
ఏ రూపమును ఆయనకు సాటిచేయగలరు?
19విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయును
కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును
దానికి వెండి గొలుసులు చేయును
20విలువగలదానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని
మ్రాను ఏర్పరచుకొనును
కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పని
వాని వెదకి పిలుచుకొనును.
21మీకు తెలియదా? మీరు వినలేదా?
మొదటినుండి ఎవరును మీతో చెప్పలేదా?
భూమిని స్థాపించుటనుబట్టి మీరు దాని గ్రహింపలేదా?
22ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు
దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు
ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును
వ్యాపింపజేసెను
ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస
స్థలముగా ఏర్పరచెను.
23రాజులను ఆయనలేకుండచేయును
భూమియొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపు
లుగా చేయును.
24వారు నాటబడగనే విత్తబడగనేవారి మొదలు భూమిలో వేరు తన్నకమునుపే
ఆయన వారిమీద ఊదగా వారు వాడిపోవుదురు
సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని
ఎగరగొట్టును.
25నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి
చేయుదురు?
అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.
26మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను?
వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు
దేరజేసి వీటన్నిటికిని పేరులుపెట్టి పిలుచువాడే
గదా.
తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము
చేతను ఆయనయొక్కటియైనను విడిచిపెట్టడు.
27యాకోబూ–నా మార్గము యెహోవాకు మరుగై
యున్నది
నా న్యాయము నా దేవునిదృష్టికి కనబడలేదు అని
నీవేల అనుచున్నావు? ఇశ్రాయేలూ, నీవేల ఈలాగు
చెప్పుచున్నావు?
28నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను
సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు
ఆయన సొమ్మసిల్లడు అలయడు
ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.
29సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే
శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.
30బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు
యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు
31యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము
పొందుదురువారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు
అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 40: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి