న్యాయాధిపతులు 15
15
1కొన్నిదినములైన తరువాత గోధుమల కోతకాలమున సమ్సోను మేకపిల్ల ఒకటి తీసికొని తన భార్యను చూడ వచ్చి–అంతఃపురములోనున్న నా భార్యయొద్దకు నేను పోదుననుకొనగా 2ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ల నియ్యక–నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని; ఆమె చెల్లెలు ఆమెకంటె చక్కనిదికాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును చిత్తగించుమనెను. 3అప్పుడు సమ్సోను–నేను ఫిలిష్తీయులకు హానిచేసినయెడల వారి విషయములో నేనిప్పుడు నిరపరాధినైయుందునని వారితో చెప్పి 4పోయి మూడు వందల నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి రెండేసి తోకలమధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి 5ఆ దివిటీలో అగ్ని మండచేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్షతోటలను ఒలీవతోటలను తగులబెట్టెను. 6ఫిలిష్తీయులు–ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు, తిమ్నా యుని అల్లుడైన సమ్సోను భార్యను ఆమె తండ్రి తీసికొని అతని స్నేహితుని కిచ్చెను గనుక అతడే చేసియుండెనని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. 7అప్పుడు సమ్సోను–మీరు ఈలాగున చేసినయెడల నేను మీమీద పగతీర్చుకొనిన తరువాతనే చాలించెదనని చెప్పి 8తొడలతో తుంట్లను విరుగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటుపిమ్మట వెళ్లి ఏతాము బండసందులో నివసించెను.
9అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదాదేశములో దిగి చెదరి, లేహీలో దోపిడికొరకై దండు కూర్చిరి. 10యూదావారు–మీరేల మా మీదికి వచ్చితిరని అడుగగా ఫిలిష్తీయులు–సమ్సోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలెనని అతని కట్టుటకే వచ్చితిమనిరి. 11అందుకు యూదా జనులలో మూడువేలమంది ఏతాములోని బండ యొద్దకు పోయి సమ్సోనును చూచి–ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు–వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితిననెను. 12అందుకు వారు–మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా సమ్సోను–మీరు నామీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనెను. 13అందుకు వారు–ఆలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపముగాని నిన్ను గట్టిగా కట్టి వారిచేతికి మేము అప్పగించెదమని చెప్పి రెండు క్రొత్త తాళ్లచేత అతని కట్టి ఆ బండయొద్దనుండి అతని తీసికొనివచ్చిరి. 14అతడు లేహీకి వచ్చువరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతనిమీదికి బలముగా వచ్చినందున అతనిచేతులకు కట్టబడిన తాళ్లు అగ్నిచేత కాల్చబడిన జనుపనారవలె నాయెను; సంకెళ్లును అతనిచేతులమీదనుండి విడిపోయెను. 15అతడు గాడిదయొక్క పచ్చి దవడ యెముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత వెయ్యిమంది మనుష్యులను చంపెను. 16అప్పుడు సమ్సోను
గాడిద దవడ యెముకతో ఒక కుప్పను
రెండు కుప్పలను నేను చంపియున్నాను
గాడిద దవడ యెముకతో వెయ్యిమంది నరులను
చంపియున్నాను అనెను.
17అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ యెము కను చేతినుండి పారవేసి ఆ చోటికి రామత్లెహీ#15:17 దనడకొండ. అను పేరు పెట్టెను. 18అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొఱ్ఱపెట్టి–నీవు నీ సేవకునిచేతివలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి, సున్నతి పొందనివారి చేతిలోనికి పడవలెనా? అని వేడుకొనగా 19దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దానినుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రదికెను. కాబట్టి దానిపేరు నేటివరకు ఏన్హక్కోరె#15:19 పిలిచినవానియూట. అనబడెను; అది లేహీలో నున్నది. 20అతడు ఫిలిష్తీయుల దినములలో ఇరువదియేండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియైయుండెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
న్యాయాధిపతులు 15: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: