యోబు 10
10
1నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినది
నేను అడ్డులేకుండ అంగలార్చెదను
నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను
2నా మీద నేరము మోపకుండుము
నీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియ
జేయుమని నేను దేవునితో చెప్పెదను.
3దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా?
దుష్టుల ఆలోచనమీద దయాదృష్టియుంచుట
సంతోషమా?
నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా?
4నీ నేత్రములు నరుల నేత్రములవంటివా?
నరులు ఆలోచించునట్లు నీవు ఆలోచించు వాడవా?
5నీ జీవితకాలము నరుల జీవిత కాలమువంటిదా?
నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల
వంటివా?
6నేను దోషిని కాననియు
7నీ చేతిలోనుండి విడిపింపగలవాడెవడును లేడనియు
నీవు ఎరిగియుండియు
నీవేల నా దోషమునుగూర్చి విచారణచేయు
చున్నావు?
నా పాపమును ఏల వెదకుచున్నావు?
8నీ హస్తములు నాకు అవయవ నిర్మాణముచేసి నన్ను
రూపించియున్నను
నీవు నన్ను మ్రింగివేయుచున్నావు.
9జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి
జ్ఞాపకము చేసికొనుము
నీవు నన్ను మరల మన్నుగా చేయుదువా?
10ఒకడు పాలుపోసినట్లు నీవు నన్ను పోసితివిగదా
జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేర
బెట్టితివి గదా.
11చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి
ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి.
12జీవము ననుగ్రహించి నాయెడల కృప చూపితివి
నీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి.
13అయినను నా లోపములనుగూర్చి నీవు నీ హృదయ
ములో ఆలోచించితివి
ఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును.
14నేను పాపము చేసినయెడల నీవు దాని కనిపెట్టుదువు
నా దోషమునకు పరిహారము చేయకుందువు.
15నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధ
కలుగును
నేను నిర్దోషినైయుండినను అతిశయపడను
అవమానముతో నిండుకొని
నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.
16నేను సంతోషించినయెడల
ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నామీద
చూపుదువు.
సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు
17ఎడతెగక నామీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవు
ఎడతెగక నామీద నీ ఉగ్రతను పెంచెదవు
ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా
మీదికి రాజేసెదవు.
18గర్భములోనుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి?
అప్పుడే యెవరును నన్ను చూడకుండ నేను ప్రాణము
విడిచి యుండినయెడల మేలు;
19అప్పుడు నేను లేనట్లే యుండియుందును
గర్భములోనుండి సమాధికి కొనిపోబడియుందును.
20నా దినములు కొంచెమే గదా
తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు
21అంధకారము మరణాంధకారముగల దేశమునకు
22కటికచీకటియై గాఢాంధకారమయమైన దేశమునకు
భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు
వెలుగే చీకటిగాగల దేశమునకు నేను వెళ్లక ముందు
కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు
నన్ను విడిచి నా జోలికి రాకుండుము.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 10: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: