యోబు 19
19
1అంతట యోబు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను–
2ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు?
ఎన్నాళ్లు మాటలచేత నన్ను నలుగగొట్టుదురు?
3పదిమారులు మీరు నన్ను నిందించితిరి
సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు.
4నేను తప్పుచేసినయెడల
నా తప్పు నా మీదికే వచ్చును గదా?
5మిమ్మును మీరు నామీద హెచ్చించుకొందురా?
నా నేరము నామీద మీరు మోపుదురా?
6ఆలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు
తన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరు
తెలిసికొనుడి.
7నామీద బలాత్కారము జరుగుచున్నదని నేను
మొఱ్ఱపెట్టుచున్నాను గాని నా మొఱ్ఱ అంగీక
రింపబడదు
సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని
న్యాయము దొరకదు.
8నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసియున్నాడు.
నా త్రోవలను చీకటి చేసియున్నాడు
9ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడు
తలమీదనుండి నా కిరీటమును తీసివేసియున్నాడు.
10నలుదిశలు ఆయన నన్ను విరుగగొట్టగా నేను నాశనమై పోతిని
ఒకడు చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణా
ధారమును పెల్లగించెను.
11ఆయన నామీద తన కోపమును రగులబెట్టెను
నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను.
12ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరివారు నామీద ముట్టడిదిబ్బలు వేసిరి
నా గుడారముచుట్టు దిగిరి.
13ఆయన నా సోదరజనమును నాకు దూరముచేసి
యున్నాడు
నా నెళవరులు నాకు కేవలము అన్యులైరి.
14నా బంధువులు నాయొద్దకు రాకయున్నారు
నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయియున్నారు.
15నా యింటి దాస దాసీ జనులు నన్ను అన్యునిగా
ఎంచెదరు
నేను వారి దృష్టికి పరదేశినై యున్నాను.
16నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండ
నున్నాడు
నేను వాని బతిమాలవలసి వచ్చెను.
17నా ఊపిరి నా భార్యకు అసహ్యము
నేను#19:17 నాతోడ బుట్టినవారు. కనిన కుమారులకు నా వాసన అసహ్యము.
18చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు
నేను లేచుట చూచినయెడల బాలురు నామీద
దూషణలు పలికెదరు.
19నా ప్రాణస్నేహితులకందరికి నేనసహ్యుడనైతిని
నేను ప్రేమించినవారు నా మీద తిరుగబడియున్నారు.
20నా యెముకలు నా చర్మముతోను నా మాంసము
తోను అంటుకొని యున్నవి
దంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలింపబడియున్నది
21దేవుని హస్తము నన్ను మొత్తియున్నది
నామీద జాలిపడుడి నా స్నేహితులారా నామీద
జాలిపడుడి.
22నా శరీరమాంసము పోవుట చాలుననుకొనక
దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుముదురు?
23నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరు
చున్నాను.
అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో
కోరుచున్నాను.
24అవి యినుపపోగరతో బండమీద చెక్కబడి సీస
ముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో
కోరుచున్నాను.
25అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత
ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.
26ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీర
ముతో#19:26 లేక–శరీరములేనివాడనై. నేను దేవుని చూచెదను.
27నామట్టుకు నేనే చూచెదను.
మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయనను
చూచెదను#19:27 పరాయివానిని చూచినట్లు కాదు.
నాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి
28జరిగినదాని కారణము నాలోనే ఉన్నదనుకొని
మీరు–మేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచినయెడల
29మీరు ఖడ్గమునకు భయపడుడి
తీర్పుకలుగునని మీరు తెలిసికొనునట్లు ఉగ్రతకు తగిన
దోషములకు శిక్ష నియమింపబడును.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 19: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: