యోబు 28
28
1వెండికి గని గలదు
పుటమువేయు సువర్ణమునకు స్థలము గలదు.
2ఇనుమును మంటిలోనుండి తీయుదురు
రాళ్లు కరగించి రాగి తీయుదురు.
3మనుష్యులు చీకటికి అంతము కలుగజేయుదురు
గాఢాంధకారములోను మరణాంధకారములోను
ఉండు రత్నములను వెదకుచువారు భూమ్యంతములవరకు సంచరింతురు.
4జనులు తిరుగు స్థలములకు చాల దిగువగా మనుష్యులు
సొరంగము త్రవ్వుదురువారు పైసంచరించువారిచేత మరువబడుదురు
అచ్చట వారు మానవులకు దూరముగానుండి ఇటు
అటు అల్లాడుచుందురు.
5భూమినుండి ఆహారము పుట్టును
దాని లోపలిభాగము అగ్నిమయమైనట్లుండును.
6దాని రాళ్లు నీలరత్నములకు స్థానము
దానిలో సువర్ణమయమైన రాళ్లున్నవి.
7ఆ త్రోవ యే క్రూరపక్షికైనను తెలియదు
డేగ కన్నులు దాని చూడలేదు
8గర్వముగల క్రూర జంతువులు దాని త్రొక్కలేదు.
సింహము ఆ మార్గమున నడవలేదు
9మనుష్యులు స్ఫటికమువంటి బండను పట్టుకొందురు
పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్ల
ద్రోయుదురు.
10బండలలో వారు బాటలు కొట్టుదురువారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును.
11నీళ్లు ఓడిగిలిపోకుండ వారు జలధారలకు గట్టు కట్టుదురు
మరుగైయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు
12అయితే జ్ఞానము ఎక్కడ దొరకును?
వివేచన దొరకు స్థలము ఎక్కడ నున్నది?
13నరులు దాని విలువను ఎరుగరు
ప్రాణులున్న దేశములో అది దొరకదు.
14అగాధము–అది నాలో లేదనును
సముద్రము–నాయొద్ద లేదనును.
15సువర్ణము దానికి సాటియైనది కాదు
దాని విలువకొరకై వెండి తూచరాదు.
16అది ఓఫీరు బంగారమునకైనను
విలువగల గోమేధికమునకైనను
నీలమునకైనను కొనబడునది కాదు.
17సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటికావు
ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు.
18పగడముల పేరు ముత్యముల పేరు దానియెదుట
ఎత్తనేకూడదు.
జ్ఞానసంపాద్యము కెంపులకన్న కోరతగినది
19కూషుదేశపు పుష్యరాగము దానితో సాటికాదు.
శుద్ధసువర్ణమునకు కొనబడునది కాదు.
20అట్లైన జ్ఞానము ఎక్కడనుండి వచ్చును?
వివేచన దొరకు స్థలమెక్కడ నున్నది?
21అది సజీవులందరి కన్నులకు మరుగై యున్నది
ఆకాశపక్షులకు మరుగుచేయబడి యున్నది.
22మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశన
మును మరణమును అనును.
23దేవుడే దాని మార్గమును గ్రహించును
దాని స్థలము ఆయనకే తెలియును.
24ఆయన భూమ్యంతములవరకు చూచుచున్నాడు.
ఆకాశము క్రింది దానినంతటిని తెలిసికొనుచున్నాడు.
25గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు
ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన
వాటిని కొలిచి చూచినప్పుడు
26వర్షమునకు కట్టడ నియమించినప్పుడు
ఉరుముతోకూడిన మెరుపునకు మార్గము ఏర్పరచినప్పుడు
27ఆయన దాని చూచి బయలుపరచెను
దానిని స్థాపనచేసి దాని పరిశోధించెను.
28మరియు–యెహోవాయందలి భయభక్తులే జ్ఞాన
మనియు
దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన
నరులకు సెలవిచ్చెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 28: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: