యోబు 30
30
1ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సుగలవారు
నన్ను ఎగతాళి చేయుదురు.
వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో
నుండుటకు తగనివారని నేను తలంచియుంటిని.
2వారి చేతుల బలము నా కేమి ప్రయోజనమగును?వారి పౌరుషము పోయినది.
3దారిద్యముచేతను క్షామముచేతను శుష్కించినవారై
ఎడారిలో చాల దినములనుండి పాడై నిర్మానుష్య
ముగానున్న యెడారిలో ఆహారముకొరకు వారు
తిరుగులాడుదురు
4వారు తుప్పలలోని తుత్తిచెట్లను పెరుకుదురు
తంగేడువేళ్లు వారికి ఆహారమైయున్నవి.
5వారు నరులమధ్యనుండి తరిమివేయబడినవారు
దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుష్యులువారిని తరుముచు కేకలు వేయుదురు.
భయంకరమైన లోయలలోను
6నేల సందులలోను బండల సందులలోను వారు కాపుర
ముండవలసి వచ్చెను.
7తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు
ముళ్లచెట్లక్రింద వారు కూడియుందురు.
8వారు మోటువారికిని పేరు ప్రతిష్ఠలు లేనివారికిని
పుట్టినవారువారు దేశములోనుండి తరుమబడినవారు.
9అట్టివారు ఇప్పుడు నన్నుగూర్చి పదములు పాడుదురు
నేను వారికి సామెతకు ఆస్పదముగా నున్నాను.
10వారు నన్ను అసహ్యించుకొందురు నా యొద్ద నుండి
దూరముగా పోవుదురు
నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు
11ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను
కావునవారు నాకు లోబడక కళ్లెము వదలించు
కొందురు.
12నా కుడిప్రక్కను అల్లరిమూక లేచునువారు నా కాళ్లను తొట్రిల్లచేయుదురు
పట్టణమునకు ముట్టడిదిబ్బ వేసినట్లు తమ నాశన
ప్రయత్నములను నామీద సాగింతురు.
13వారు నిరాధారులైనను
నా మార్గమును పాడుచేయుదురు
నామీదికి వచ్చిన ఆపదను మరి యధికము కలుగ
జేయుదురు
14గొప్ప గండిగుండ జలప్రవాహము వచ్చునట్లువారు
వచ్చెదరు
ఆ వినాశములో వారు కొట్టుకొనిపోవుదురు.
15భీకరమైనవి నామీద పడెను
గాలి కొట్టివేయునట్లువారు నా ప్రభావమును కొట్టి
వేయుదురు
మేఘమువలె నా క్షేమము గతించిపోయెను.
16నా ఆత్మ నాలో కరిగిపోయి యున్నది
ఆపద్దినములు నన్ను పట్టుకొనియున్నవి
17రాత్రివేళను నా యెముకలు నాలో విరుగగొట్టబడు
నట్లున్నవి
నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు.
18మహా రోగబలముచేత నా వస్త్రము నిరూపమగును
మెడచుట్టునుండు నా చొక్కాయివలె అది నన్ను
ఇరికించుచున్నది.
19ఆయన నన్ను బురదలోనికి త్రోసెను
నేను ధూళియు బూడిదెయునైనట్లున్నాను.
20నీకు మొఱ్ఱపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తర
మేమియు నియ్యకున్నావు
నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు.
21నీవు మారిపోయి నాయెడల కఠినుడవైతివి
నీ బాహుబలముచేత నన్ను హింసించుచున్నావు
22గాలిచేత నన్ను లేవనెత్తి దానిమీద నన్ను కొట్టుకొని
పోజేయుచున్నావు
తుపానుచేత నన్ను హరించివేయుచున్నావు
23మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత
సమాజమందిరమునకు నీవు నన్ను రప్పించెదవని
నాకు తెలియును.
24ఒకడు పడిపోవునెడల వాడు చెయ్యిచాపడా?
ఆపదలో నున్నవాడు తప్పింపవలెనని మొఱ్ఱపెట్టడా?
25బాధలోనున్నవారి నిమిత్తము నేను ఏడవలేదా?
దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా?
26నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు
కీడు సంభవించెను
వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను.
27నా పేగులు మానక మండుచున్నవి
అపాయదినములు నన్నెదుర్కొనెను.
28సూర్యుని ప్రకాశములేక వ్యాకులపడుచు నేను
సంచరించుచున్నాను
సమాజములో నిలువబడి మొఱ్ఱపెట్టుచున్నాను.
29నేను నక్కలకు సోదరుడనైతిని
నిప్పుకోళ్ల జతకాడనైతిని.
30నా చర్మము నల్లబడి నామీదనుండి ఊడిపోవుచున్నది
కాకవలన నా యెముకలు కాగిపోయెను.
నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది
నా పిల్లనగ్రోవి రోదనశబ్దము ఎత్తుచున్నది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 30: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: