యోబు 38
38
1అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగున
యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను–
2జ్ఞానములేని మాటలు చెప్పి–ఆలోచనను చెరుపుచున్న
వీడెవడు?
3పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము
నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు
తెలియజెప్పుము.
4నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ
నుంటివి?
నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.
5నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన
వాడెవడో చెప్పుము.
6దానిమీద పరిమాణపు కొల వేసినవాడెవడో చెప్పుము.
దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో
చెప్పుము.
7ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు
దేవదూతలందరును#38:7 దేవుని కుమారులు. ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు
దాని మూలరాతిని వేసినవాడెవడు?
8సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా
తలుపులచేత దానిని మూసినవాడెవడు?
9నేను మేఘమును దానికి వస్త్రముగాను
గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా?
10దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను
తలుపులను పెట్టించినప్పుడు
11–నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు
ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు
నేను చెప్పినప్పుడు నీవుంటివా?
12-13అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించునట్లును
అది దుష్టులను తనలోనుండకుండ దులిపివేయునట్లును
నీ వెప్పుడైన ఉదయమును కలుగజేసితివా?
అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా?
14ముద్రవలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా
భూముఖము మార్పునొందును
విచిత్రమైన పనిగల వస్త్రమువలె సమస్తమును కన
బడును.
15దుష్టుల వెలుగు వారియొద్దనుండి తీసివేయబడును
వారెత్తిన బాహువు విరుగగొట్టబడును.
16సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా?
మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా?
17మరణద్వారములు నీకు తెరవబడెనా?
మరణాంధకార ద్వారములను నీవు చూచితివా?
18భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా?
నీకేమైన తెలిసినయెడల చెప్పుము.
19-20వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది?
చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది?
దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా?
దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా?
21ఇదంతయు నీకు తెలిసియున్నది గదా. నీవు బహు
వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి.
22నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా?
23ఆపత్కాలముకొరకును యుద్ధముకొరకును యుద్ధ
దినముకొరకును నేను దాచియుంచిన
వడగండ్ల నిధులను నీవు చూచితివా?
24వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది?
తూర్పు గాలి యెక్కడనుండి వచ్చి భూమిమీద నఖ
ముఖములను వ్యాపించును?
25నిర్మానుష్య ప్రదేశముమీదను
26జనులులేని యెడారిలోను వర్షము కురిపించుటకును
27పాడైన యెడారిని తృప్తిపరచుటకును
లేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను
ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించు
వాడెవడు?
28వర్షమునకు తండ్రి యున్నాడా?
మంచు బిందువులను పుట్టించువాడెవడు?
29మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును?
ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును?
30జలములు రాతివలె గడ్డకట్టును
అగాధజలముల ముఖము గట్టిపరచబడును.
31కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా?
మృగశీర్షకు కట్లను విప్పగలవా?
32వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చు
నట్లు చేయగలవా?
సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు
నడిపింపగలవా?
33ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా?
దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప
గలవా?
34జలరాసులు నిన్ను కప్పునట్లు
మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా?
35మెరుపులు బయలువెళ్లి
–చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు
నీవు వాటిని బయటికి రప్పింపగలవా?
36అంతరింద్రియములలో#38:36 మేఘములలో. జ్ఞానముంచిన వాడెవడు?
హృదయమునకు#38:36 నక్షత్రములకు. తెలివి నిచ్చినవాడెవడు?
37జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు?
38ధూళి బురదయై పారునట్లును
మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనునట్లును
ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించు
వాడెవడు?
39ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా?
40సింహపుపిల్లలు తమతమ గుహలలో పండుకొనునప్పుడు
తమ గుహలలో పొంచి యుండునప్పుడు నీవు వాటి
ఆకలి తీర్చెదవా?
41తిండిలేక తిరుగులాడుచు
కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు
కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 38: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: