యోబు 8
8
1అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లనెను
2–ఎంత కాలము నీవిట్టి మాటలాడెదవు?
నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయెను.
3దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా?
సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా?
4నీ కుమారులు ఆయన దృష్టియెదుట పాపముచేసి
రేమో
కావుననే వారు చేసిన తిరుగుబాటునుబట్టి ఆయనవారిని అప్పగించెనేమో.
5నీవు జాగ్రత్తగా దేవుని వెదకినయెడల
సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనినయెడల
6నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనయెడల
నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి
నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును.
7అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను
తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు.
8మనము నిన్నటివారమే, మనకు ఏమియు తెలియదు
భూమిమీద మన దినములు నీడవలె నున్నవి.
9మునుపటి తరమువారి సంగతులు విచారించుమువారి పితరులు పరీక్షించినదానిని బాగుగా తెలిసికొనుము.
10వారు నీకు బోధించుదురు గదా వారు నీకు తెలుపుదురు గదావారు తమ అనుభవమునుబట్టి మాటలాడుదురు గదా.
11బురదలేకుండ జమ్ము పెరుగునా?
నీళ్లులేకుండ రెల్లు మొలచునా?
12అది కోయబడకముందు బహు పచ్చగానున్నది కాని
యితర మొక్కలన్నిటికంటె త్వరగా వాడిపోవును.
13దేవుని మరచువారందరి గతి అట్లే ఉండును
భక్తిహీనుని ఆశ నిరర్థకమగును
14అతని ఆశ భంగమగును.
అతడు ఆశ్రయించునది సాలెపురుగు పట్టే.
15అతడు తన యింటిమీద ఆనుకొనగా అది నిలువదు.
అతడు గట్టిగా దాని పట్టుకొనగా అది విడిపోవును.
16ఎండకు అతడు పచ్చిపెట్టి బలియును
అతని తీగెలు అతని తోటమీద అల్లుకొనును.
17అతని వేళ్లు గట్టుమీద చుట్టుకొనును
రాళ్లుగల తన నివాసమును అతడు తేరిచూచును.
18దేవుడు అతని స్థలములోనుండి అతని వెళ్లగొట్టిన
యెడల
అది–నేను నిన్నెరుగను ఎప్పుడును నిన్ను చూడ
లేదనును.
19ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము
అతడున్న ధూళినుండి ఇతరులు పుట్టెదరు.
20ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసి
వేయడు.
ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు.
21నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురు
దుష్టుల గుడారము ఇక నిలువకపోవును.
22అయితే ఇంకను ఆయన నీకు నోటినిండ నవ్వు కలుగజేయును.
ప్రహర్షముతో నీ పెదవులను నింపును.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 8: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: