లేవీయకాండము 7
7
1అపరాధపరిహారార్థబలి అతిపరిశుద్ధము. దాని గూర్చిన విధి యేదనగా 2దహనబలి పశువులను వధించుచోట అపరాధపరిహారార్థబలిరూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను. 3దానిలోనుండి దాని క్రొవ్వంతటిని, అనగా దాని క్రొవ్విన తోకను దాని ఆంత్రములలోని క్రొవ్వును 4రెండు మూత్ర గ్రంథులను డొక్కలపైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథులమీది క్రొవ్వును కాలేజముమీది వపను తీసి దాని నంతయు అర్పింపవలెను. 5యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠముమీద వాటిని దహింపవలెను; అది అపరాధపరిహారార్థబలి; యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; 6అది అతిపరిశుద్ధము, పరిశుద్ధస్థలములో దానిని తినవలెను. 7పాపపరిహారార్థబలిని గూర్చిగాని అపరాధపరిహారార్థబలిని గూర్చిగాని విధియొక్కటే. ఆ బలిద్రవ్యము దానివలన ప్రాయశ్చిత్తముచేయు యాజకుని దగును. 8ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆయాజకుడు అర్పించిన దహనబలిపశువు చర్మము అతనిది; అది అతనిదగును. 9పొయ్యిమీద వండిన ప్రతి నైవేద్యమును,కుండలోనేగాని పెనముమీదనేగాని కాల్చినది యావత్తును, దానిని అర్పించిన యాజకునిది, అది అతనిదగును. 10అది నూనె కలిసినదేగాని పొడిదేగాని మీ నైవేద్యములన్నిటిని అహరోను సంతతివారు సమముగా పంచుకొనవలెను.
11ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధానబలిని గూర్చిన విధి యేదనగా 12వాడు కృతజ్ఞతార్పణముగా దాని నర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమపిండి వంటలను అర్పింపవలెను. 13ఆ పిండివంటలేకాక సమాధానబలి రూపమైన కృతజ్ఞతాబలిద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను. 14మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలోనుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. అది సమాధానబలిపశురక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతనిదగును. 15సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతాబలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను; దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు. 16అతడు అర్పించుబలి మ్రొక్కుబడియేగాని స్వేచ్ఛార్పణయేగాని అయినయెడల అతడు దాని నర్పించు నాడే తినవలెను. 17మిగిలినది మరునాడు తినవచ్చును; మూడవనాడు ఆ బలిపశువు మాంసములో మిగిలినదానిని అగ్నితో కాల్చి వేయవలెను. 18ఒకడు తన సమాధానబలి పశువుమాంసములో కొంచెమైనను మూడవనాడు తినినయెడల అది అంగీకరింపబడదు; అది అర్పించినవానికి సమాధానబలిగా ఎంచబడదు; అది హేయము; దాని తినువాడు తన దోషశిక్షను భరించును. 19అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు; అగ్నితో దానిని కాల్చివేయవలెను; మాంసము విషయమైతే పవిత్రులందరు మాంసమును తినవచ్చునుగాని 20ఒకడు తనకు అపవిత్రత కలిగియుండగా యెహోవాకు అర్పించు సమాధానబలి పశువుమాంసములో కొంచెమైనను తినినయెడలవాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును. 21ఎవడు మనుష్యుల అపవిత్రతనేగాని అపవిత్రమైన జంతువునేగాని యే అపవిత్రమైన వస్తువునేగాని తాకి యెహోవాకు అర్పించు సమాధానబలిపశువు మాంసమును తినునోవాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును.
22మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను 23–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము – ఎద్దుదేగాని గొఱ్ఱెదేగాని మేకదేగాని దేని క్రొవ్వును మీరు తినకూడదు. 24చచ్చినదాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చునుగాని దాని నేమాత్రమును తినకూడదు. 25ఏలయనగా మనుష్యులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును. 26మరియు పక్షిదేగాని జంతువుదేగాని యే రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు. 27ఎవడు రక్తము తినునోవాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.
28మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను 29–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఎవడు యెహోవాకు సమాధానబలిద్రవ్యములను తెచ్చునోవాడు ఆ ద్రవ్యములలోనుండి తాను అర్పించునది యెహోవా సన్ని ధికి తేవలెను. 30అతడు తన చేతులలోనే యెహోవాకు హోమద్రవ్యములను, అనగా బోరమీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను. 31యాజకుడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని, బోర అహరోనుకును అతని సంతతివారికిని చెందును. 32సమాధానబలిపశువులలోనుండి ప్రతిష్ఠార్పణముగా యాజకునికి కుడి జబ్బనియ్యవలెను. 33అహరోను సంతతివారిలో ఎవడు సమాధానబలియగు పశువురక్తమును క్రొవ్వును అర్పించునో కుడిజబ్బ వానిదగును. 34ఏలయనగా ఇశ్రాయేలీయుల యొద్దనుండి, అనగా వారి సమాధానబలిద్రవ్యములలోనుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసికొని, నిత్యమైన కట్టడచొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతివారికిని ఇచ్చియున్నాను. 35వారు తనకు యాజకులగునట్లు యెహోవావారిని చేర దీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమద్రవ్యములలోనుండినది అభిషేకమునుబట్టి అహరోనుకును అభిషేకమునుబట్టియే అతని సంతతివారికిని కలిగెను. 36వీటిని ఇశ్రాయేలీయులు వారికియ్యవలెనని యెహోవావారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను. 37-38ఇది దహనబలిని గూర్చియు అపరాధపరిహారార్థపు నైవేద్యమునుగూర్చియు పాపపరిహా రార్థబలినిగూర్చియు అపరాధపరిహారార్థబలినిగూర్చియు ప్రతిష్ఠితార్పణమునుగూర్చియు సమాధానబలినిగూర్చియు చేయబడిన విధి. ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములను తీసికొని రావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండమీద మోషేకు ఆలాగుననే ఆజ్ఞాపించెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
లేవీయకాండము 7: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: