వారు యెరికోపట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహుజనసమూహముతోను యెరికోనుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయి యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని– దావీదు కుమారుడా యేసూ, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు–దావీదు కుమారుడా, నన్ను కరు ణింపుమని మరి ఎక్కువగా కేకలువేసెను. అప్పుడు యేసు నిలిచి–వానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డివానిని పిలిచి–ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి, దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు–నేను నీకేమి చేయగోరుచున్నావని వానినడుగగా, ఆ గ్రుడ్డివాడు–బోధకుడా, నాకు దృష్టి కలుగ జేయుమని ఆయనతో అనెను. అందుకు యేసు–నీవు వెళ్లుము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయనవెంట చూపుపొంది వెళ్లెను.
చదువండి మార్కు 10
వినండి మార్కు 10
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మార్కు 10:46-52
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు