సామెతలు 16
16
1హృదయాలోచనలు మనుష్యుని వశము,
చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలుగును.
2ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా
కనబడును
యెహోవా ఆత్మలను పరిశోధించును.
3నీ పనుల భారము యెహోవామీద నుంచుము
అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును.
4యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము
కలుగజేసెను
నాశనదినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను.
5గర్వహృదయులందరు యెహోవాకు హేయులు
నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు.
6కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము
కలుగును
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన
మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు.
7ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు
ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా
చేయును.
8అన్యాయముచేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె
నీతితోకూడిన కొంచెమే శ్రేష్ఠము.
9ఒకడు తాను చేయబోవునది హృదయములో
యోచించుకొనును
యెహోవా వాని నడతను స్థిరపరచును
10దేవోక్తి పలుకుట రాజువశము
న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము
తప్పదు.
11న్యాయమైన త్రాసును తూనికరాళ్లును యెహోవా
యొక్క యేర్పాటులు
సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించెను.
12రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది
నీతివలన సింహాసనము స్థిరపరచబడును.
13నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు
యథార్థవాదులు వారికి ప్రియులు.
14రాజు క్రోధము మరణదూత
జ్ఞానియైనవాడు ఆ క్రోధమును శాంతిపరచును.
15రాజుల ముఖప్రకాశమువలన జీవము కలుగునువారి కటాక్షము కడవరి వానమబ్బు.
16అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపా
దించుట ఎంతో శ్రేష్ఠము
వెండిని సంపాదించుటకంటె తెలివిని సంపాదించుట
ఎంతో మేలు.
17చెడుతనము విడిచి నడచుటయే యథార్థవంతులకు
రాజమార్గము
తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును
కాపాడుకొనును.
18నాశనమునకు ముందు గర్వము నడచును.
పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు
నడచును
19గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకొనుటకంటె
దీనమనస్సు కలిగి దీనులతో పొత్తుచేయుట మేలు.
20ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునొందును
యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు.
21జ్ఞానహృదయుడు వివేకి యనబడును
రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును.
22తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట
మూఢులకు వారి మూఢత్వమే శిక్ష
23జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును
వాని పెదవులకు విద్య విస్తరింపజేయును.
24ఇంపైన మాటలు తేనెపట్టువంటివి
అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య
కరమైనవి.
25ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును
అయినను తుదకు అది మరణమునకు చేరును.
26కష్టము చేయువాని ఆకలి వానికొరకు వానిచేత
కష్టము చేయించును
వాని కడుపు వానిని తొందరపెట్టును.
27పనికిమాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును
వాని పెదవులమీద అగ్ని మండుచున్నట్టున్నది.
28మూర్ఖుడు కలహము పుట్టించును
కొండెగాడు మిత్రభేదము చేయును.
29బలాత్కారి తన పొరుగువానిని లాలనచేయును
కానిమార్గములో వాని నడిపించును.
30కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసికొని
తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు.
31నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము
అవి నీతిప్రవర్తన గలవానికి కలిగి యుండును.
32పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు
పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన
పరచుకొనువాడు శ్రేష్ఠుడు
33చీట్లు ఒడిలో వేయబడును
వాటివలని తీర్పు యెహోవా వశము.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సామెతలు 16: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: