సామెతలు 20
20
1ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును
మద్యము అల్లరి పుట్టించును
దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు.
2రాజువలని భయము సింహగర్జనవంటిది
రాజునకు క్రోధము పుట్టించువారు తమకు
ప్రాణమోసము తెచ్చుకొందురు
3కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత
మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును.
4విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు
కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించునప్పుడు వానికేమియు లేకపోవును.
5నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల
వంటిది
వివేకముగలవాడు దానిని పైకి చేదుకొనును.
6దయ చూపువానిని కలిసికొనుట అనేకులకు తట
స్థించును
నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును?
7యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు
వాని తదనంతరము ధన్యులగుదురు.
8న్యాయసింహాసనాసీనుడైన రాజు
తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును.
9– నా హృదయమును శుద్ధపరచుకొని యున్నాను
పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొనదగిన
వాడెవడు?
10వేరువేరు తూనికె రాళ్లు వేరువేరు కుంచములు
ఈ రెండును యెహోవాకు హేయములు.
11బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో
యథార్థమైనదో కాదో
తన చేష్టలవలన తెలియజేయును.
12వినగల చెవి చూడగల కన్ను
ఈ రెండును యెహోవా కలుగచేసినవే.
13లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము
నీవు మేల్కొనియుండినయెడల ఆహారము తిని తృప్తి
పొందుదువు.
14కొనువాడు–జబ్బుది జబ్బుది అనును
అవతలికి వెళ్లి దాని మెచ్చుకొనును.
15బంగారును విస్తారమైన ముత్యములును కలవు.
తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు.
16అన్యునికొరకు పూటబడినవాని వస్త్రమును పుచ్చుకొనుము
పరులకొరకు వానినే కుదువపెట్టించుము
17మోసము చేసి తెచ్చుకొన్న ఆహారము మనుష్యులకు
బహు ఇంపుగా ఉండును
పిమ్మట వాని నోరు మంటితో నింపబడును.
18ఉద్దేశములు ఆలోచనచేత స్థిరపరచబడును
వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము.
19కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట
పెట్టును
కావున వదరుబోతుల జోలికి పోకుము.
20తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము
కారుచీకటిలో ఆరిపోవును.
21మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము
తుదకు దీవెన నొందకపోవును.
22– కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు
యెహోవాకొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను
రక్షించును.
23వేరువేరు తూనికె రాళ్లు యెహోవాకు హేయములు
దొంగత్రాసు అనుకూలము కాదు.
24ఒకని నడతలు యెహోవా వశము
తనకు సంభవింపబోవునది యొకడెట్లు తెలిసికొన
గలడు?
25వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు
మ్రొక్కుకొనిన తరువాత దానిగూర్చి విచారించు
టయు ఒకనికి ఉరియగును.
26జ్ఞానముగల రాజు భక్తిహీనులను చెదరగొట్టునువారిమీద చక్రము దొర్లించును.
27నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము
అది అంతరంగములన్నియు శోధించును.
28కృపాసత్యములు రాజును కాపాడును
కృపవలన అతడు తన సింహాసనమును స్థిరపరచు
కొనును.
29యౌవనస్థుల బలము వారికి అలంకారము
తలనెరపు వృద్ధులకు సౌందర్యము
30గాయములుచేయు దెబ్బలు
అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగిం
చును.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సామెతలు 20: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: