సామెతలు 31
31
1రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతని
కుపదేశించిన దేవోక్తి,
2నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమారుడా, నేనేమందును?
నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనే
మందును?
3నీ బలమును స్త్రీలకియ్యకుము
రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము
4ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు
లెమూయేలూ, అది రాజులకు తగదు
మద్యపానాసక్తి అధికారులకు తగదు.
5త్రాగినయెడల వారు కట్టడలను మరతురు
దీనులకందరికి అన్యాయము చేయుదురు
6ప్రాణము పోవుచున్నవానికి మద్యము నియ్యుడి
మనోవ్యాకులముగలవారికి ద్రాక్షారసము నియ్యుడి.
7వారు త్రాగి తమ పేదరికము మరతురు
తమ శ్రమను ఇక తలంచకుందురు.
8మూగవారికిని దిక్కులేనివారికందరికిని న్యాయము
జరుగునట్లు నీ నోరు తెరువుము.
9నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము
దీనులకును శ్రమపడువారికిని దరిద్రులకును న్యాయము
జరిగింపుము.
10గుణవతియైన భార్య దొరుకుట అరుదు
అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది.
11ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మికయుంచును
అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు.
12ఆమె తాను బ్రదుకు దినములన్నియు
అతనికి మేలుచేయును గాని కీడేమియు చేయదు.
13ఆమె గొఱ్ఱెబొచ్చును అవిసెనారను వెదకును
తన చేతులార వాటితో పనిచేయును.
14వర్తకపు ఓడలు దూరమునుండి ఆహారము తెచ్చునట్లు
ఆమె దూరమునుండి ఆహారము తెచ్చుకొనును.
15ఆమె చీకటితోనే లేచి, తన యింటివారికి భోజనము
సిద్ధపరచును
తన పనికత్తెలకు బత్తెము#31:15 పనిని ఏర్పరచును. ఏర్పరచును.
16ఆమె పొలమును చూచి దానిని తీసికొనును
తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్షతోట
యొకటి నాటించును.
17ఆమె నడికట్టుచేత నడుము బలపరచుకొని
చేతులతో బలముగా పనిచేయును
18తన వ్యాపారలాభము అనుభవముచే తెలిసికొనును
రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు.
19ఆమె పంటెను చేతపట్టుకొనును
తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును.
20దీనులకు తన చెయ్యి చాపును
దరిద్రులకు తన చేతులు చాపును
21తన యింటివారికి చలి తగులునని భయపడదు
ఆమె యింటివారందరు రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు.
22ఆమె పరుపులను సిద్ధపరచుకొనును
ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు.
23ఆమె పెనిమిటి దేశపు పెద్దలతోకూడ కూర్చుండును
గవినియొద్ద పేరుగొనినవాడైయుండును.
24ఆమె నారబట్టలు నేయించి అమ్మును
నడికట్లను వర్తకులకు అమ్మును.
25బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు
ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును.
26జ్ఞానము కలిగి తన నోరు తెరచును
కృపగల ఉపదేశము ఆమె బోధించును.
27ఆమె తన యింటివారి నడతలను బాగుగా కని
పెట్టును
పనిచేయకుండ ఆమె భోజనము చేయదు.
28ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు
29– చాలమంది కుమార్తెలు పతివ్రతాధర్మము ననుసరించియున్నారు గాని
వారందరిని నీవు మించినదానవు అని
ఆమె పెనిమిటి ఆమెను పొగడును.
30అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము
యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని
యాడబడును
31చేసిన పనినిబట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును
గవునులయొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సామెతలు 31: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: