కీర్తనలు 120

120
యాత్రకీర్తన.
1నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని
ఆయన నాకు ఉత్తరమిచ్చెను.
2యెహోవా, అబద్ధమాడు పెదవులనుండియు
మోసకరమైన నాలుకనుండియు నా ప్రాణమును
విడిపించుము.
3మోసకరమైన నాలుకా, ఆయన నీకేమి చేయును?
ఇంతకంటె అధికముగా నీకేమి చేయును?
4తంగేడునిప్పులతోకూడిన బాణములను
బలాఢ్యుల వాడిగల బాణములను నీమీద వేయును
5అయ్యో, నేను మెషెకులో పరదేశినై యున్నాను.
కేదారు గుడారములయొద్ద కాపురమున్నాను.
6కలహప్రియునియొద్ద
నేను చిరకాలము నివసించినవాడను.
7నేను కోరునది సమాధానమే
అయినను మాట నా నోట వచ్చినతోడనే వారు
యుద్ధమునకు సిద్ధమగుదురు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 120: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి