కీర్తనలు 147
147
1యెహోవాను స్తుతించుడి.
మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది
అది మనోహరము స్తోత్రముచేయుట ఒప్పిదము.
2యెహోవాయే యెరూషలేమును కట్టువాడు
చెదరిన ఇశ్రాయేలీయులను పోగుచేయువాడు
3గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడువారి గాయములు కట్టువాడు.
4నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు
వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు.
5మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు
ఆయన జ్ఞానమునకు మితిలేదు.
6యెహోవా దీనులను లేవనెత్తువాడు
భక్తిహీనులను ఆయన నేలను కూల్చును.
7కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి.
సితారాతో మన దేవుని కీర్తించుడి.
8ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు
భూమికొరకు వర్షము సిద్ధపరచువాడు
పర్వతములమీద గడ్డి మొలిపించువాడు
9పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును
ఆయన ఆహారమిచ్చువాడు.
10గుఱ్ఱముల బలమునందు ఆయన సంతోషించడు
నరులకాలిసత్తువయందు ఆయన ఆనందించడు.
11తనయందు భయభక్తులుగలవారియందు
తన కృపకొరకు కనిపెట్టువారియందు
యెహోవా ఆనందించువాడైయున్నాడు.
12యెరూషలేమా, యెహోవాను కొనియాడుము
సీయోనూ, నీ దేవుని కొనియాడుము.
13ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచియున్నాడు
నీమధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాడు.
14నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు
ఆయనే
మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే
15భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే
ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును.
16గొఱ్ఱెబొచ్చువంటి హిమము కురిపించువాడు ఆయనే
బూడిదవంటి మంచు కణములు చల్లువాడు ఆయనే.
17ముక్కముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే.
ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు?
18ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నియు కరిగిపోవును
ఆయన తనగాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును,
19ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను
తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు
తెలియజేసెను.
20ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు
ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి.
యెహోవాను స్తుతించుడి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 147: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: