కీర్తనలు 18
18
ప్రధానగాయకునికి. యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలోనుండియు, సౌలు చేతిలోనుండియు యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి, అతడు ఇట్లనెను.
1యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు
చున్నాను.
2యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు
వాడు
నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత
దుర్గము, నా దేవుడు
నేను ఆశ్రయించియున్న నా దుర్గము.
3కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా
ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షిం
చును.
4మరణ పాశములు నన్ను చుట్టుకొనగను,
భక్తిహీనులు వరద పొర్లువలె నామీదపడి బెదరింపగను
5పాతాళపు పాశములు నన్ను అరికట్టగను
మరణపు ఉరులు నన్ను ఆవరింపగను
6నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని
నా దేవునికి ప్రార్థన చేసితిని
ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన
నంగీకరించెను
నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల
జొచ్చెను.
7అప్పుడు భూమి కంపించి అదిరెను
పర్వతముల పునాదులు వణకెను
ఆయన కోపింపగా అవి కంపించెను.
8ఆయన నాసికారంధ్రములనుండి పొగ పుట్టెను
ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను
9నిప్పుకణములు రాజబెట్టెను.
మేఘములను వంచి ఆయన వచ్చెను
ఆయన పాదములక్రింద గాఢాంధకారము కమ్మి
యుండెను.
10కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను
గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.
11గుడారమువలె అంధకారము తన చుట్టు వ్యాపింప
జేసెను
జలాంధకారమును ఆకాశమేఘములను తనకు మాటుగా
చేసికొనెను.
12ఆయన సన్నిధి కాంతిలోనుండి మేఘములును వడ
గండ్లును మండుచున్న నిప్పులును దాటిపోయెను.
13యెహోవా ఆకాశమందు గర్జనచేసెను
సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను
వడగండ్లును మండుచున్న నిప్పులును రాలెను.
14ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను
చెదరగొట్టెను
మెరుపులు మెండుగా మెరపించి వారిని ఓడగొట్టెను.
15యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు
వడిగా విడువగా
నీ గద్దింపునకు ప్రవాహముల అడుగుభాగములు
కనబడెను.
భూమి పునాదులు బయలుపడెను.
16ఉన్నతస్థలమునుండి చెయ్యి చాపి ఆయన నన్ను
పట్టుకొనెను
17నన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను.
బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు
నాకంటె బలిష్ఠులైయుండగావారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను.
18ఆపత్కాలమందువారు నామీదికి రాగా
యెహోవా నన్ను ఆదుకొనెను.
19విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని
వచ్చెను
నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను
తప్పించెను.
20నా నీతినిబట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను
నా నిర్దోషత్వమునుబట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.
21యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను
భక్తిహీనుడనై నేను నా దేవుని విడచినవాడను కాను
22ఆయన న్యాయవిధులన్నిటిని నేను లక్ష్యపెట్టు
చున్నాను
ఆయన కట్టడలను త్రోసివేసినవాడను కాను
23దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని
ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని.
24కావున యెహోవా నేను నిర్దోషిగానుండుట చూచి
తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమునుబట్టి
నాకు ప్రతిఫలమిచ్చెను.
25దయగలవారియెడల నీవు దయచూపించుదువు
యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు
26సద్భావముగలవారియెడల నీవు సద్భావము చూపు
దువు.
మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు
27శ్రమపడువారిని నీవు రక్షించెదవు
గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు.
28నా దీపము వెలిగించువాడవు నీవే
నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా
చేయును
29నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును.
నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును.
30దేవుడు యథార్థవంతుడు
యెహోవా వాక్కు నిర్మలము
తన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము.
31యెహోవా తప్ప దేవుడేడి?
మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?
32నాకు బలము ధరింపజేయువాడు ఆయనే
నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే.
33ఆయన నాకాళ్లు జింక కాళ్లవలె చేయుచున్నాడు
ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపుచున్నాడు.
34నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే
నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు పెట్టును.
35నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు
నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెను
నీ సాత్వికము నన్ను గొప్పచేసెను.
36నా పాదములకు చోటు విశాలపరచితివి
నా చీలమండలు బెణకలేదు.
37నా శత్రువులను తరిమి పట్టుకొందునువారిని నశింపజేయువరకు నేను తిరుగను.
38వారు నా పాదముల క్రింద పడుదురువారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగ
ద్రొక్కుదును
39యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి
నా మీదికి లేచినవారిని నా క్రింద అణచివేసితివి
40నా శత్రువులను వెనుకకు నీవు మళ్లచేసితివి
నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేసితిని
41వారు మొఱ్ఱపెట్టిరి గాని రక్షించువాడు లేక పోయెను
యెహోవాకు వారు మొఱ్ఱపెట్టుదురు గాని ఆయనవారి ఉత్తరమియ్యకుండును.
42అప్పుడు గాలికి ఎగురు ధూళివలె నేను వారిని
పొడిగా కొట్టితిని
వీధుల పెంటను ఒకడు పారబోయునట్లు నేను వారిని
పారబోసితిని.
43ప్రజలుచేయు కలహములలో పడకుండ నీవు నన్ను
విడిపించితివి
నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి
నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు
44నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయు
లగుదురు
అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు
45అన్యులు నిస్తాణగలవారై వణకుచు
తమ దుర్గములను విడచి వచ్చెదరు.
46యెహోవా జీవముగలవాడు
నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు
నా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతి
నొందునుగాక.
47ఆయన నా నిమిత్తము ప్రతిదండనచేయు దేవుడు
జనములను నాకు లోబరచువాడు ఆయనే.
48ఆయన నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడి
పించును.
నా మీదికి లేచువారికంటె ఎత్తుగా నీవు నన్ను
హెచ్చించుదువు
బలాత్కారముచేయు మనుష్యుల చేతిలోనుండి
నీవు నన్ను విడిపించుదువు
49అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను
ఘనపరచెదను
నీ నామకీర్తన గానము చేసెదను.
50నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ
జేయువాడవు
అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును
నిత్యము కనికరము చూపువాడవు
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 18: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: