కీర్తనలు 4

4
ప్రధానగాయకునికి. తంతివాద్యములతో పాడదగినది. దావీదు కీర్తన.
1నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము
ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే
నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము.
2నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమాన
ముగా మార్చెదరు?
ఎంతకాలము వ్యర్థమైనదానిని ప్రేమించెదరు?
ఎంతకాలము అబద్ధమైనవాటిని వెదకెదరు?
3యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొను
చున్నాడని తెలిసికొనుడి.
నేను యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించును.
4భయమునొంది పాపము చేయకుడి
మీరు పడకలమీద నుండగా మీ హృదయములలో
ధ్యానము చేసికొని ఊరకుండుడి (సెలా.)
5నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను
నమ్ముకొనుడి
6–మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు.
యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము.
7వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిననాటి సంతో
షముకంటె
అధికమైన సంతోషము నీవు నా హృదయములో
పుట్టించితివి.
8యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును
నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా
నివసింపజేయుదువు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 4: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి