కీర్తనలు 47
47
ప్రధానగాయకునికి. కోరహు కుమారులు చేసినది. గీతము.
1సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి
జయధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి.
2యెహోవా మహోన్నతుడు భయంకరుడు
ఆయన సర్వభూమికి మహారాజై యున్నాడు.
3ఆయన జనములను మనకు లోపరచును
మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును.
4తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పద
ముగా మన స్వాస్థ్యమును
ఆయన మనకొరకు ఏర్పాటు చేసియున్నాడు.
5దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను
బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను.
6దేవుని కీర్తించుడి కీర్తించుడి
మన రాజును కీర్తించుడి కీర్తించుడి.
7దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు
రమ్యముగా కీర్తనలు పాడుడి.
8దేవుడు అన్యజనులకు రాజై యున్నాడు
దేవుడు తన పరిశుద్ధిసంహాసనముమీద ఆసీనుడై
యున్నాడు.
9జనముల ప్రధానులు అబ్రాహాముయొక్క దేవునికి
జనులై కూడుకొనియున్నారు.
10భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి
ఆయన మహోన్నతుడాయెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 47: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: