కీర్తనలు 80
80
ప్రధానగాయకునికి. షోషన్నీమ్ ఏదూత్ అను రాగముమీద పాడదగినది. ఆసాపు కీర్తన.
1ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము.
మందవలె యోసేపును నడిపించువాడా,
కెరూబులమీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము.
2ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అనువారి యెదుట
నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింపరమ్ము.
3దేవా, చెరలోనుండి మమ్మును రప్పించుము
మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము.
4యెహోవా, సైన్యములకధిపతివగు దేవా,
నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్లు నీ కోపము
పొగరాజనిచ్చెదవు?
5కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు.
విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చు
చున్నావు.
6మా పొరుగువారికి మమ్ము కలహకారణముగా
జేయుచున్నావు.
ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అప
హాస్యము చేయుచున్నారు.
7సైన్యములకధిపతివగు దేవా, చెరలోనుండి మమ్ము
రప్పించుము.
మేము రక్షణనొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము.
8నీవు ఐగుప్తులోనుండి యొక ద్రాక్షావల్లిని తెచ్చితివి
అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటితివి
9దానికి తగిన స్థలము సిద్ధపరచితివి
దాని వేరు లోతుగా పారి అది దేశమంతట వ్యాపిం
చెను
10దాని నీడ కొండలను కప్పెను
దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవ
రించెను.
11దాని తీగెలు సముద్రమువరకు వ్యాపించెను
యూఫ్రటీసు నదివరకు దాని రెమ్మలు వ్యాపించెను.
12త్రోవను నడుచువారందరు దాని తెంచివేయునట్లు
దానిచుట్టునున్న కంచెలను నీవేల పాడుచేసితివి?
13అడవిపంది దాని పెకలించుచున్నది
పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి.
14సైన్యములకధిపతివగు దేవా, ఆకాశములోనుండి
మరల చూడుము
ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము.
15నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము
నీకొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను#80:15 మూలభాషలో, కుమారుని. కాయుము.
16అది అగ్నిచేత కాల్చబడియున్నది నరకబడియున్నది
నీ కోపదృష్టివలన జనులు నశించుచున్నారు.
17నీ కుడిచేతి మనుష్యునికి తోడుగాను
నీకొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను
నీ బాహుబలముండును గాక.
18అప్పుడు మేము నీ యొద్దనుండి తొలగిపోము
నీవు మమ్మును బ్రదికింపుము అప్పుడు నీ నామమును
బట్టియే మేము మొఱ్ఱపెట్టుదుము
19యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, చెరలో
నుండి మమ్ము రప్పించుము
మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 80: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: