కీర్తనలు 86
86
దావీదు కీర్తన.
1యెహోవా, నేను దీనుడను దరిద్రుడను
చెవియొగ్గి నాకుత్తరమిమ్ము
2నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము.
నా దేవా, నిన్ను నమ్ముకొనియున్న నీ సేవకుని రక్షింపుము.
3ప్రభువా, దినమెల్ల నీకు మొఱ్ఱపెట్టుచున్నాను
నన్ను కరుణింపుము
4ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను
నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము.
5ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన
మనస్సుగలవాడవు
నీకు మొఱ్ఱపెట్టువారందరియెడల కృపాతిశయము గలవాడవు.
6యెహోవా, నా ప్రార్థనకు చెవి యొగ్గుము
నా మనవుల ధ్వని ఆలకింపుము,
7నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు
గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొఱ్ఱపెట్టె
దను.
8ప్రభువా, నీవు మహాత్మ్యముగలవాడవు ఆశ్చర్యకార్య
ములు చేయువాడవు
నీవే అద్వితీయ దేవుడవు.
9ప్రభువా, దేవతలలో నీవంటివాడు లేడు
నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు.
10నీవు సృజించిన అన్యజనులందరును వచ్చి నీ
సన్నిధిని నమస్కారము చేయుదురు
నీ నామమును ఘనపరచుదురు
11యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచు
కొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము.
నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు
ఏకదృష్టి కలుగజేయుము.
12నా పూర్ణహృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తు
తులు చెల్లించెదను
నీ నామమును నిత్యము మహిమపరచెదను.
13ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప
అధికమైనది
పాతాళపు అగాధమునుండి నా ప్రాణమును తప్పించి
యున్నావు.
14దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచియున్నారు
బలాత్కారులు గుంపుకూడి నా ప్రాణము తీయ
జూచుచున్నారువారు నిన్ను లక్ష్యపెట్టనివారై యున్నారు.
15ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు
దీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు
16నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము
నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము
నీ సేవకురాలి కుమారుని రక్షింపుము.
17యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్నాదరించు
చున్నావు
నా పగవారు చూచి సిగ్గుపడునట్లు
శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 86: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: