కీర్తనలు 96
96
1యెహోవామీద క్రొత్త కీర్తన పాడుడి
సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి
2యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతిం
చుడి
అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి.
3అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి
సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను
ప్రచురించుడి
4యెహోవా మహాత్మ్యముగలవాడు
ఆయన అధికస్తోత్రము పొందతగినవాడు
సమస్త దేవతలకంటెను ఆయన పూజనీయుడు.
5జనముల దేవతలందరు వట్టి విగ్రహములే
యెహోవా ఆకాశవిశాలమును సృజించినవాడు.
6ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి
బలసౌందర్యములు ఆయన పరిశుద్ధస్థలములో ఉన్నవి.
7జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి
మహిమబలములు యెహోవాకు చెల్లించుడి.
8యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు
చెల్లించుడి
నైవేద్యము తీసికొని ఆయన ఆవరణములలోనికి రండి.
9పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు
నమస్కారముచేయుడి
సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి.
10యెహోవా రాజ్యము చేయుచున్నాడు
లోకము కదలకుండ స్థిరపరచబడియున్నది
న్యాయమునుబట్టి ఆయన జనములను పరిపాలన
చేయును.
ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి
11యెహోవా వేంచేయుచున్నాడు
ఆకాశము సంతోషించునుగాక భూమి ఆనందించును
గాక
సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక.
12పొలమును దానియందుగల సర్వమును యెహోవా
సన్నిధిని ప్రహర్షించునుగాక.
వనవృక్షములన్నియు ఉత్సాహధ్వని చేయునుగాక.
13భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయు
చున్నాడు
న్యాయమునుబట్టి లోకమునకు తన విశ్వాస్యతనుబట్టి
జనములకు ఆయన తీర్పు తీర్చును.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 96: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: