కీర్తనలు 98
98
గీతము.
1యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు
ఆయననుగూర్చి క్రొత్తకీర్తన పాడుడి
ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు
ఆయనకు విజయము కలుగజేసియున్నది.
2యెహోవా తన రక్షణను వెల్లడిచేసియున్నాడు
అన్యజనులయెదుట తన నీతిని బయలుపరచి
యున్నాడు.
3ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్య
తలను ఆయన జ్ఞాపకము చేసికొనియున్నాడు
భూదిగంత నివాసులందరు మన దేవుడు కలుగజేసిన
రక్షణను చూచిరి.
4సర్వభూజనులారా, యెహోవానుబట్టి ఉత్సహించుడి
ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు
పాడుడి.
5సితారాస్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు
పాడుడి
సితారా తీసికొని సంగీత స్వరముతో గానము చేయుడి.
6బూరలతోను కొమ్ముల నాదముతోను
రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వనిచేయుడి.
7సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును
గాక
లోకమును దాని నివాసులును కేకలువేయుదురు
గాక.
8ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక
కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక.
9భూమికి తీర్పు తీర్చుటకై నీతినిబట్టి లోకమునకు తీర్పు
తీర్చుటకై
న్యాయమునుబట్టి జనములకు తీర్పు తీర్చుటకై
యెహోవా వేంచేసియున్నాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 98: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: