మీకా 5

5
బేత్లెహేముకు రాబోయే పాలకుడు
1యెరూషలేము ప్రజలారా, యుద్ధ సేనలతో ఇప్పుడు కలిసి రండి.
నీ పట్టణం చుట్టూ గోడ ఉంది.
అయితే శత్రువులు ఇశ్రాయేలీయుల నాయకుణ్ణి బెత్తంతో చెంప మీద కొడతారు.
2బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబాల మధ్య నువ్వు చిన్న గ్రామమైనా నా కోసం ఇశ్రాయేలీయులను పాలించేవాడు నీలోనుంచి వస్తాడు. ఆయన పూర్వకాలం నుంచి, నిత్యం నుంచి ఉన్నవాడు.
3కాబట్టి ప్రసవవేదన పడే స్త్రీ, బిడ్డను కనే వరకూ, దేవుడు వారిని అప్పగిస్తాడు.
అప్పుడు ఆయన సోదరుల్లో మిగిలినవారు ఇశ్రాయేలీయుల దగ్గరికి తిరిగి వస్తారు.
4ఆయన యెహోవా బలంతో
తన యెహోవా దేవుని పేరులోని గొప్పదనంతో
నిలబడి తన మంద మేపుతాడు.
వాళ్ళు క్షేమంగా ఉంటారు.
భూమి కొనల వరకూ ఆయన గొప్పవాడిగా ఉంటాడు.
విధ్వంసం, విమోచన
5అష్షూరీయులు మన దేశంలో చొరబడినప్పుడు,
వాళ్ళు మన ప్రాకారాల మీద దండెత్తినప్పుడు
వాన్ని ఎదిరించడానికి మేము ఏడుగురు గొర్రెల కాపరులను,
ఎనిమిది మంది నాయకులను నియమిస్తాం.
ఆయనే మనకు శాంతి.
6వారు కత్తితో అష్షూరు దేశాన్ని పాలిస్తారు.
తమ చేతుల్లోని కత్తులతో నిమ్రోదు దేశాన్ని పరిపాలిస్తారు.
అష్షూరీయులు మన దేశంలో చొరబడి
మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు
ఆయన మనలను ఇలా కాపాడతాడు.
7యాకోబు సంతానంలో మిగిలినవారు అనేక ప్రజల మధ్య నివసిస్తూ,
యెహోవా కురిపించే మంచులాగా,
మానవ ప్రయత్నం, ఆలోచన లేకుండ,
గడ్డి మీద పడే వానలాగా ఉంటారు.
8యాకోబు సంతానంలో మిగిలినవారు
రాజ్యాల మధ్య, అనేక ప్రజల మధ్య
అడవి జంతువుల్లోని సింహం లాగా,
గొర్రెల మందల్లోని కొదమ సింహం లాగా ఉంటారు.
అది మందల్లో దూరి వాటిని తొక్కుతూ వాటిని చీల్చేస్తుంది.
9నీ చెయ్యి నీ శత్రువుల మీద ఎత్తి ఉంటుంది.
అది వారిని నిర్మూలం చేస్తుంది.
10యెహోవా ఇలా చెబుతున్నాడు,
“ఆ రోజు నేను నీ గుర్రాలన్నిటినీ నాశనం చేస్తాను.
నీ రథాలను ధ్వంసం చేస్తాను.
11నీ దేశంలోని పట్టణాలను నాశనం చేస్తాను.
నీ కోటలన్నిటినీ పడగొడతాను.
12మీ మధ్య మంత్రవిద్య లేకుండా నిర్మూలం చేస్తాను.
జాతకం చెప్పేవారు ఇక నీలో ఉండరు.
13చెక్కిన విగ్రహాలూ
దేవతా స్తంభాలూ మీ మధ్య ఉండకుండాా నాశనం చేస్తాను.
అప్పటినుంచి మీరు చేతులతో చేసిన వాటికి మొక్కరు.
14మీ అషేరా దేవతా స్తంభాలను మీ మధ్య ఉండకుండాా వాటిని పెల్లగిస్తాను.
నీ పట్టణాలను పడగొడతాను.
15నేను మహా కోపంతో ఉగ్రతతో
నా మాట వినని రాజ్యాలకు ప్రతీకారం చేస్తాను.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

మీకా 5: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి