2 రాజులు 2
2
ఏలీయాని తీసికొని వెళ్ళటానికి యెహోవా నడిపించుట
1సుడిగాలి ద్వారా ఏలీయాని యెహోవా పరలోకానికి తీసుకు వెళ్లేందుకు సమయం దగ్గరపడింది. ఏలీయా ఎలీషాతో గిల్గాలుకు వెళ్లాడు.
2ఎలీషాతో, “దయచేసి ఇక్కడ వుండుము, ఎందుకనగా యెహోవా నన్ను బేతేలునకు వెళ్లుమని ఆదేశించాడు” అని చెప్పాడు.
కాని ఎలీషా, “యెహోవా జీవంతోడు, నా జీవం తోడు నేను నిన్ను విడిచి వెళ్లను” అని ఏలీయాతో చెప్పాడు. అందువల్ల ఆ ఇద్దరు మనష్యులు బేతేలుకు వెళ్లారు.
3బేతేలులో వున్న ప్రవక్తలు ఎలీషా వద్దకు వచ్చి యిట్లన్నారు: “నేడు నీ యజమానిని నీ వద్దనుండి యెహోవా తీసుకొని పోవునన్న విషయం నీకు తెలుసా?”
“అవును. నాకు తెలుసు. ఆ విషయం మాటలాడకు.” అని ఎలీషా చెప్పాడు.
4ఎలీషాతో ఏలీయా, “దయచేసి ఇక్కడ వుండుము. ఎందుకనగా నన్ను యెరికోకు వెళ్లమని యెహోవా ఆదేశించాడు” అని చెప్పాడు.
కాని ఎలీషా, “యెహోవా జీవంతోడు, నా జీవంతోడు నేను నిన్ను విడిచి వెళ్లను” అని చెప్పాడు. అందువల్ల వారిరువురు మనష్యులు యెరికోకు వెళ్లారు.
5యెరికోలోనున్న ప్రవక్తల బృందం ఎలీషా వద్దకు వచ్చి యిట్లున్నారు. “నేడు నీ యజమానిని నీ వద్దనుండి యెహోవా తీసుకొని పోవునన్న విషయం నీకు తెలుసా?”
ఎలీషా, “అవును, నాకు తెలుసు. ఆ విషయమై మాటలాడకు” అని చెప్పాడు.
6ఏలీయా ఎలీషాతో, “దయచేసి ఇక్కడ వుండుము. ఎందుకంటే నన్ను యోర్దాను నది వద్దకు వెళ్లమని యెహోవా ఆదేశించాడు” అనిచెప్పాడు.
ఎలీషా ఇలా అన్నాడు, “యెహోవా జీవంతోడు, నా జీవంతోడు నేను నిన్ను విడిచి వెళ్లను.” అందువల్ల ఆ ఇరువురు వెళ్లారు.
7ప్రవక్తల బృందం నుండి ఏభై మంది మనుష్యులు వారిని అనుసరించారు. ఏలీయా ఎలీషాలు యోర్దాను నదివద్ద నిలిచారు. ఆ ఏభై మంది మనుష్యులు ఏలీయా ఎలీషాలకు దూరంగా నిలబడ్డారు. 8ఏలీయా తన దుప్పటిని తీసి మడత పెట్టి నీటిమీద దానితో కొట్టాడు. నీళ్లు కుడికీ ఎడమకీ వేరు వేరయ్యాయి. అప్పుడు ఏలీయా ఎలీషాలు పొడినేల మీద నదిని దాటారు.
9వారు నదిని దాటిన తర్వాత, ఏలీయా ఎలీషాతో, “నీనుండి యెహోవా నన్ను తీసుకొని పోవడానికి ముందు నీ కోసం నన్నేమి చేయమంటావు?” అని ఏలీయా అడిగాడు.
“నీ ఆత్మ రెండింతల భాగాముగా నామీదికి వచ్చునట్లు చేయి” అని ఎలీషా అడిగాడు.
10ఏలీయా, “కష్టమైన విషయం నీవు అడిగావు. నన్ను నీనుండి తీసుకొని పోయేటప్పుడు నన్ను చూస్తూ వుంటే అది జరుగుతుంది. కాని నన్ను నీనుండి తీసుకొని పోయెటప్పుడు చూడకుంటే, అప్పుడు, అది జరగదు” అని చెప్పాడు.
దేవుడు ఏలీయాను పరలోకానికి తీసుకొని పోవుట
11ఏలీయా ఎలీషాలు ఒకటిగా నడుస్తూ మాటాలాడుతూ వున్నారు. ఉన్నట్టుండి కొన్ని గుర్రాలు, ఒక అగ్నిరథం వచ్చి ఏలీయా ఎలీషాలను వేరు చేసాయి. ఆ గుర్రాలు మరియు రథం ఉన్నాయి. తర్వాత ఒక సుడిగాలి ద్వారా ఏలీయా పరలోకానికి తీసుకొని పోబడ్డాడు.
12అది ఎలీషా చూచి, నా తండ్రి! “నా తండ్రి! ఇశ్రాయేలు రథం, దాని గుర్రపు సైనికులు నీవె”#2:12 ఇశ్రాయేలు … సైనికులు దేవుడు మరియు ఆయన పరలోక సైన్యం అని అర్థం. అని అరిచాడు.
ఎలీషా ఏలీయాని ఆ తర్వతా ఎన్నడూ చూడలేదు. ఎలీషా తన విచారాన్ని వ్యక్తం చేయడానికి తన వస్త్రాలను రెండుగా చింపివేశాడు. 13ఏలీయా ధరించు కంబళి భూమిమీదికి పడింది. అందువల్ల ఎలీషా దానిని తీసుకున్నాడు. ఎలీషా నీటినికొట్టి, “ఏలీయా దేవుడైన యెహోవా ఎక్కడ?” అన్నాడు. 14ఎలీషా నీటిని కొట్టగా నీళ్లు కుడుకీ ఎడమకీ వేరు వేరయ్యాయి. అప్పుడు ఎలీషా నదిని దాటాడు.
ఏలీయా కోసం ప్రవక్తలు అడుగుట
15యెరికోలోని ప్రవక్తల బృందం ఎలీషాని చూడగానే, “ఏలీయా ఆత్మ ఇప్పుడు ఎలీషా మీద వున్నది” అన్నారు. ఎలీషాని కలుసుకునేందుకు వారు వచ్చారు. ఎలీషా ముందు వారు నేలకు తాకునట్లుగా నమస్కరించారు. 16అతనితో వారు ఇట్లన్నారు: “ఇదుగో, మా వద్ద ఏభై మంది సజ్జనులున్నారు. వారు వెళ్లి నీ యజమానికోసం వెతకనిమ్ము. యెహోవా ఆత్మ ఒకవేళ ఏలీయాని పైకి తీసుకొని పోయి ఏ కొండమీదనో లేక ఏ లోయలోనో పడవేసి వుండవచ్చు.”
కాని ఎలీషా, “వద్దు ఏలీయాని వెతకడం కోసం మనుష్యుల్ని పంపవద్దు” అని చెప్పాడు.
17ప్రవక్తల బృందం అతను ఇబ్బందిలో పడనంత వరకు ప్రార్థంచారు. అప్పుడు ఎలీషా, “బాగున్నది. ఏలీయాని వెతకడం కోసం మనుష్యుల్ని పంపించండి” అని చెప్పాడు.
ప్రవక్తల బృందం ఆ ఏభై మంది మనుష్యులను ఏలీయాకోసం పంపారు. మూడు రోజుల పాటు వారు వెతికారు. కాని వారు ఏలీయాను కనుగొనలేక పోయారు. 18కనుక ఎలీషా నివసించుచున్న యెరికోకి వారు వెళ్లారు. ఏలీయాని తాము కనుగొనలేక పోయామని వాళ్లు అతనితో చెప్పారు. ఎలీషా, “మీరు వెళ్లవద్దని నేను చెప్పాను గదా” అన్నాడు.
ఎలీషా నీటిని మంచి నీళ్లుగా చేయుట
19ఆ నగర పౌరులు ఎలీషాతో, “అయ్యా, ఈ నగరం చక్కని ప్రదేశంలో వున్నట్టు మీరు చూస్తున్నారు. కాని నీళ్లు మంచివి కావు. అందువల్లనే ఈ ప్రదేశంలో పంటలు పండవు” అని చెప్పారు.
20“ఒక కొత్త పాత్ర తీసుకురండి. అందులో ఉప్పు వేయండి” అని ఎలీషా చెప్పాడు.
పౌరులు పాత్రను ఎలీషా వద్దకు తీసుకు వచ్చారు. 21తర్వాత భూమినుండి నీరు ప్రవహించే ఆ స్థలం వద్దకు ఎలీషా వెళ్లాడు. ఎలీషా ఆ ఉప్పును నీటిలోకి విసిరాడు. “నేను ఈ నీటిని బాగు చేయుచున్నానని, ఇప్పటినుండి ఈ నీరు మరణము కలిగించదు. పంటలు పండనట్లుగా చేయదు” అని యెహోవా చెప్పాడు.
22ఆ నీరు శుద్ధమయ్యింది. ఆ జలము నేటికీ మంచి నీరుగా ఉంది ఎలీషా చెప్పినట్లుగానే అది జరిగెను.
ఎలీషాని కొందరు పిల్లలు ఎగతాళి చేయుట
23ఎలీషా ఆ నగరం నుండి బేతేలుకు వెళ్లాడు. ఎలీషా నగరం చేరడానికి కొండ ఎక్కుతూ ఉన్నాడు. నగరం నుండి కొందరు పిల్లలు బయటకి వస్తున్నారు. ఎలీషాని చూచి, వారు ఎగతాళి చేశారు. అతనితో వారు ఇట్లు అన్నారు: “ఓ బట్టతల మనిషీ, పైకి వెళ్లుము.”
24ఎలీషా వెనుదిరిగి ఆ బాలురను చూశాడు. వారి పట్ల చెడు విషయాలు జరగాలని అతను యెహోవాని అర్థించాడు. తర్వాత అడవినుండి రెండు ఎలుగు బంట్లు వెలుపలికి వచ్చి ఆ బాలురను ఎదిరించాయి. ఆ ఎలుగుబంట్లు ఆ నలభై రెండు మంది పిల్లలను చీల్చివేశాయి.
25ఎలీషా బేతేలు వీడి కర్మెలు పర్వతం వద్దకు వెళ్లాడు. మరియు అక్కడ నుండి, ఎలీషా షోమ్రోనుకు మరలి వెళ్లాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 రాజులు 2: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International

: